AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: వేరు శనగను అధికంగా తింటున్నారా.. బీ అలర్ట్.. లేకుంటే అంతే సంగతులు

వేరు శనగ (Groundnuts) మంచి ప్రొటీన్ ఫుడ్.. వీటిలో సంతృప్తికర కొవ్వులు కూడా అధికంగానే ఉంటాయి. వీటిని ఏ విధంగా తీసుకున్నా రుచికి రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం. వేయించుకుని తిన్నా, ఉడకించుకుని తిన్నా...

Health: వేరు శనగను అధికంగా తింటున్నారా.. బీ అలర్ట్.. లేకుంటే అంతే సంగతులు
Peanuts
Ganesh Mudavath
|

Updated on: Sep 07, 2022 | 5:55 PM

Share

వేరు శనగ (Groundnuts) మంచి ప్రొటీన్ ఫుడ్.. వీటిలో సంతృప్తికర కొవ్వులు కూడా అధికంగానే ఉంటాయి. వీటిని ఏ విధంగా తీసుకున్నా రుచికి రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం. వేయించుకుని తిన్నా, ఉడకించుకుని తిన్నా మంచి హెల్తీ స్నాక్. అంతే కాదండోయ్.. బెల్లంతో కలిపి చేసే చిక్కీలు ఎంత రుచికరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఫీల్ ను అనుభవించాల్సిందే గానీ వర్ణించలేం. కాబట్టే చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనికి ఫేవరెట్ అయిపోయారు. ఇక ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి అల్పాహారాల్లో పల్లీ చట్నీ సూపర్ కాంబినేషన్. రక్త హీనత సమస్యతో బాధపడే వారు పల్లీలను ఆహారంలో భాగం చేసుకుంటే ఈ సమస్య బారి నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా తక్షణ శక్తినిచ్చి నీరసాన్ని పోగోడుతుంది. శరీరం (Health) చురుకుగా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. వీటిని తరచూ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రయణలో ఉంటాయి. పొట్ట నిండిన భావన కలిగించి, ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో బరువు పెరిగే అవకాశాలు తగ్గిపోతాయి. అయితే వేరు శనగ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో వాటిని ఎక్కువగా తింటే అంతే దుష్ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

వేరుశనగను అధికంగా తింటే పోషకాహార లోపం రావచ్చని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. వీటిలో ఫాస్పరస్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫైటేట్ రూపంలో నిల్వ ఉంటాయి. ఇది ఇతర ఖనిజాల శోషణను నిలిపివేస్తుంది. దీంతో పోషకాహార లోపం వస్తుంది. కాలేయం పై ప్రభావం చూపుతుంది. కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మలబద్ధకం, విరేచనాలు, ఉబ్బరం, సమస్యలు తలెత్తుతాయి. పల్లీలను అధికంగా తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. వేరు శనగల్లో 170 కేలరీలు ఉంటాయి. ఇవి స్నాక్స్ గా తినడానికి సరిపోతాయి. కానీ అంతకంటే ఎక్కువ తింటే మాత్రం అధికంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నోట్.. ఈ కథనం లో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..