Pineapple Health: అనాస పండుతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. బరువు తగ్గాలనుకునే వారికి సూపర్ ఫుడ్..
పైకి గరుకుగా.. లోపల సున్నితంగా తియ్యగా ఉండే అనాసతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి మేలు చేసే ఈ పండును రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు..

పైకి గరుకుగా.. లోపల సున్నితంగా తియ్యగా ఉండే అనాసతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి మేలు చేసే ఈ పండును రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందుతాయి. అంతే కాకుండా తక్షణ శక్తిని అందించడంలో అనాస చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్ శరీర పనితీరును మెరుగుపరిచేందుకు తోడ్పడతాయి. అనాసలో ఉండే మాంగనీస్ ఎముకలకు బలం అందిస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిండమే కాకుండా.. శరీరానికి తగిన గాయాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి అనాస సూపర్ ఫుడ్ అని ఆరోగ్య నిపుణఉలు చెబుతున్నారు. రోజూ ఓ గ్లాసు పైనాపిల్ రసాన్ని తాగటం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీరం బలంగా తయారవుతుంది. పుల్లగా తియ్యగా ఉండే పైనాపిల్‌లో పొటాషియం, సోడియం అధికంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలను దూరం చేస్తాయి. మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.
పచ్చ కామెర్లతో బాధ పడుతున్న వారికి అనాస రసం ఎంతో మేలు చేస్తుంది. అనాస పండు ముక్కలను తేనెలో ఇరవై నాలుగు గంటలు వుంచి తింటే అజీర్తి తగ్గుతుంది. పేగులో చలనం కలిగి విరోచనం సాఫీగా జరుగుతుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది. నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. పూర్తిగా పండని అనాస రసం తీసు కుంటే కడుపులో పురుగులు చనిపోతాయి. జ్వరం, కామెర్లు వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాస రసం మంచి ఉపశమనం ఇస్తుంది. అనాసపండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్థన చేస్తే చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. అనాసలోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి.
చర్మంపై వచ్చే నల్లటి మచ్చలను తొలగిస్తుంది. అనాసలోని ఎంజైమ్స్ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధుల ను నివారిస్తుంది. ఫాయిడ్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పచ్చి అనాస రసాన్ని గాయాలపై వేస్తే రక్తస్రావం తగ్గుతుంది. అనాస రసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలను ఇస్తుంది. ఫైబర్ మలబద్ధకం తగ్గించడానికి సహాయపడుతుంది. గర్భంగా ఉన్న మహిళలు ఈ పందు తినడం వల్ల వికారము నుంచి ఉపశమనం కలుగుతుంది.




మరిన్ని హెల్త్ న్యూస్ కోసం