Hair Tips: జుట్టు రాలుతోందా.. చుండ్రు వేధిస్తోందా.. అయితే ఒక్కసారి ఈ షాంపూను ట్రై చేయండి..

మహిళలు తమ జుట్టును అందంగా ఉంచుకోవడానికి రక రకాల షాంపూలు, కండీషనర్లను ఉపయోగిస్తుంటారు. కానీ ఖరీదైన షాంపూలు, కండీషనర్‌ల తయారీ లో ఉపయోగించే రసాయనాల కారణంగా జుట్టు అందంగా కనిపిస్తుంది...

Hair Tips: జుట్టు రాలుతోందా.. చుండ్రు వేధిస్తోందా.. అయితే ఒక్కసారి ఈ షాంపూను ట్రై చేయండి..
Herbal Shampoo
Follow us

|

Updated on: Nov 11, 2022 | 7:37 PM

మహిళలు తమ జుట్టును అందంగా ఉంచుకోవడానికి రక రకాల షాంపూలు, కండీషనర్లను ఉపయోగిస్తుంటారు. కానీ ఖరీదైన షాంపూలు, కండీషనర్‌ల తయారీ లో ఉపయోగించే రసాయనాల కారణంగా జుట్టు అందంగా కనిపిస్తుంది. పైకి అందంగా, నాజూగ్గా కనిపించినా అంతర్గతంగా అది కలిగించే నష్టం మాత్రం మనకు ఏ మాత్రం కనిపించదు. అంతే కాకుండా వీటిని ఉపయోగించడం ద్వారా జుట్టు సురక్షితంగా ఉంటుందనీ చెప్పలేం. కాబట్టి ఇంట్లోనే సహజ సిద్ధమైన షాంపూను సిద్ధం చేసుకోవచ్చు. ఇది జుట్టుకు పోషణను అందించడమే కాకుండా బలోపేతం చేస్తుంది. చుండ్రు, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఈ సింపుల్ టిప్స్ తో ఇంట్లోనే చక్కగా హెర్బల్ షాంపూను తయారు చేసుకోవచ్చు.

ఒక కప్పులో రెండు చెంచాల షీకాకాయలు, రెండు చెంచాల రీతా (కుంకుడు కాయలు) పౌడర్, ఒక చెంచా వేప పొడి, ఒక చెంచా ఉసిరి పొడి వేసుకని కలుపుకోవాలి. పాన్‌లో ఒక గ్లాసు నీళ్లు తీసుకుని వేడి చేయాలి. నీళ్ళు వేడయ్యాక అందులో షికేకాయ్, రీతా పొడి, నిమ్మకాయ పొడి, ఉసిరి పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లబరచాలి. కాసేపయ్యాక దీనిని వడగట్టి సీసాలో పోసుకోవాలి. తల స్నానం చేసే సమయంలో ఈ హెర్బల్ షాంపూను చక్కగా ఉపయోగించుకోవచ్చు.

ఈ షాంపూను ఉపయోగించే ముందు జుట్టును తడిగా ఉంటాలి. తర్వాత ఈ షాంపూ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. చేతులతో జుట్టుకు మసాజ్ చేయాలి. కొంత సమయం నీటితో జుట్టును కడగాలి. ఇలా చేస్తే మీ జుట్టు మెరిసిపోతుంది. ఉసిరి, కుంకుడు కాయలు, శీకా కాయలు, వేపల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి స్కాల్ప్ పీహెచ్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. అంతే కాకుండా ఈ షాంపూని ఉపయోగించడం వల్ల జుట్టు అందంగా మెరుస్తూ దృఢంగా మారుతుంది. జుట్టు రాలడం, చిట్లడం, చుండ్రు వంటి జుట్టు సమస్యలు కూడా తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం