AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఆ సమస్యలతో బాధపడే వారికి అద్భుత వరం.. వెల్లుల్లి నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

వంటించి పదార్థాలలో వెల్లుల్లి కూడా ఒకటి. పోపు వేసుకునేటప్పడు వెల్లుల్లి లేనిదే వంటకు టేస్ట్ రాదు. వెల్లుల్లిలో ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. హై కొలెస్ట్రాల్ లెవెల్స్, హై బీపీ ఉన్నవారు వెల్లుల్లిని ఆహాహంలో భాగం చేసుకుంటే..

Health: ఆ సమస్యలతో బాధపడే వారికి అద్భుత వరం.. వెల్లుల్లి నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Garlic Health Benefits
Ganesh Mudavath
|

Updated on: Nov 06, 2022 | 8:23 AM

Share

వంటించి పదార్థాలలో వెల్లుల్లి కూడా ఒకటి. పోపు వేసుకునేటప్పడు వెల్లుల్లి లేనిదే వంటకు టేస్ట్ రాదు. వెల్లుల్లిలో ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. హై కొలెస్ట్రాల్ లెవెల్స్, హై బీపీ ఉన్నవారు వెల్లుల్లిని ఆహాహంలో భాగం చేసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి చాలా మంచిది. పచ్చి వెల్లుల్లి బీపీ ని తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. అంతే కాకుండా షుగర్ లెవెల్స్ తగ్గుతాయని, కంట్రోల్ లో ఉంటాయని వెల్లడైంది. వీటిలో ఉండే విటమిన్ బి6, విటమిన్ సీ, కార్బోహైడ్రేట్ మెటబాలిజమ్ పై ఆధారపడి ఉంటాయి. కార్డియో వాస్కులర్ ఆరోగ్యానికి మేలు చేసి, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్‌ను నియంత్రిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఇందులో ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది. సాధారణంగా వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది. కాబట్టి దీనిని తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించరు. వెల్లుల్లిని తీసుకోవడానికి లిమిట్ అంటూ ఏమీ లేదు. ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎవరికి కావాలసినంత పరిమాణంలో వారు నిరభ్యంతరంగా తినవచ్చు. వెల్లుల్లి తినేందుకు ఇష్టపడని వాళ్లు డాక్టర్ల సలహా మేరకు సప్లిమెంట్స్‌ను తీసుకోవచ్చు.

జలుబు, దగ్గును నివారిస్తుంది. గొంతు కండరాల నొప్పిని తగ్గించి మింగడంలో ఇబ్బంది లేకుండా చేస్తుంది. వివిధ అధ్యయనాల ప్రకారం వెల్లుల్లి తినడం వల్ల జలుబు దాదాపు 60 శాతం వరకు తగ్గుతుందని తేలింది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని సల్ఫర్ ఎర్ర రక్త కణాల ద్వారా హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువుగా మారుతుంది. ఇది రక్త నాళాలను శుభ్రపరుస్తుంది. ఫలితంగా గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అల్జీమర్స్, డీమెన్షియా వంటి క్షీణించిన వ్యాధులని నివారించడంలో వెల్లుల్లి బాగా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా వెల్లుల్లి నీరు మేలు చేస్తుంది. రోజూ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది.

ఎంత ఆరోగ్యాన్ని కలిగించినా ఏదైనా తక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది. మేలు చేస్తుంది కదా అని ఎక్కువగా తిన్నా ప్రమాదమే. వెల్లుల్లిని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, అలర్జీ, దద్దుర్లు వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..