AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: డయాబెటిస్ బాధితులకు బోడ కాకర అద్భుత వరం.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

బోడకాకరకాయలు (Spiny Gourd).. చూసేందుకు ఆకుపచ్చని రంగులో గుండ్రంగా, బొడిపెలతో ఉండే వీటితో ఎన్నో ఆరోగ్య్ ప్రయోజనాలు ఉన్నాయి. వర్షాకాలంలో విస్తారంగా లభ్యమయ్యే వీటిని అకాకరకాయలు అని కూడా..

Health: డయాబెటిస్ బాధితులకు బోడ కాకర అద్భుత వరం.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..
Spiny Gourd
Ganesh Mudavath
|

Updated on: Sep 11, 2022 | 7:07 PM

Share

బోడకాకరకాయలు (Spiny Gourd).. చూసేందుకు ఆకుపచ్చని రంగులో గుండ్రంగా, బొడిపెలతో ఉండే వీటితో ఎన్నో ఆరోగ్య్ ప్రయోజనాలు ఉన్నాయి. వర్షాకాలంలో విస్తారంగా లభ్యమయ్యే వీటిని అకాకరకాయలు అని కూడా పిలుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో చౌకగా లభించే ఇవి నగరాలు, పట్టణాల్లో అధిక ధర పలుకుతుంటాయి. అయినప్పటికీ భోజనప్రియులు ఏ మాత్రం సంకోచించకుండా వీటిని కొనేసి, ఇంటికి తెచ్చేసి, కూరో, పులుసో చేసుకుని లాగించేస్తుంటారు. బోడ కాకరలో కేలరీలు తక్కువగా, పోషకాలు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో జలుబు, జ్వరం వంటివి వేధిస్తుంటాయి. వీటి నుంచి రక్షించుకునేందుకు బోడ కాకరను ఆహారంలో (Health) భాగం చేసుకోవాలి. ఇది డయాబెటిస్‌ను నియంత్రించి, జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి చక్కటి ఆహారంగా పని చేస్తుంది. దీనిలో ఉండే లుటీన్‌ వంటి కెరోటినాయిడ్లు కంటి వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌లు రాకుండా అడ్డుకుంటాయి.

వంద గ్రాముల ఆకాకరలో కేవలం 17 కేలరీలు మాత్రమే లభిస్తాయి. వీటిలో సమృద్ధిగా లభించే ప్లేవనాయిడ్లు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి. బోడ కాకర కూర తినడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో అటవీ ప్రాంతాల్లో బోడ కాకరలు ఎక్కువగా లభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు, చిన్నారులు, పశువుల కాపరులు వీటిని సేకరించి మార్కెట్లలో అమ్ముతున్నారు. ఒక్కోసారి కిలో రూ. కేవలం 2 నెలలు మాత్రమే దొరకడం, ఔషధ గుణాలు ఉండడంతో ఖరీదు ఎక్కువైనా బోడ కాకరకాయలను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..