AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మోకాళ్ల నొప్పులకు ఇది కూడా ఒక కారణమే.. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే తస్మాత్ జాగ్రత్త..

శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ మొదలైన తీవ్రమైన గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీంతోపాటు మోకాళ్ల నొప్పులు కూడా మొదలవుతాయి.

Health Tips: మోకాళ్ల నొప్పులకు ఇది కూడా ఒక కారణమే.. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే తస్మాత్ జాగ్రత్త..
Knee Pain
Shaik Madar Saheb
|

Updated on: Sep 11, 2022 | 7:18 PM

Share

High Cholesterol : శరీరంలో కణాలను తయారు చేయడానికి కొలెస్ట్రాల్ అవసరం. అయితే ఈ కొలెస్ట్రాల్ శరీరంలో ఎక్కువ పెరిగితే అది చాలా తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ప్రస్తుతం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉండటం సర్వసాధారణమైపోయింది. చాలా మంది ప్రజల అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారు. శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ మొదలైన తీవ్రమైన గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీంతోపాటు మోకాళ్ల నొప్పులు కూడా పెరుగుతాయి. అయితే.. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ (Bad Cholesterol) స్థాయిని తగ్గించుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు..

అధిక కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు శరీరం తరచుగా పలు సంకేతాలను ఇస్తుంది. అయితే.. తరచుగా దీనిని గుర్తించడం ఆలస్యం అవుతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంలో రక్తం సక్రమంగా ప్రవహించకపోవడం వల్ల మోకాళ్ల నొప్పులు వచ్చి నడవడానికి ఇబ్బంది పడుతుంటారు. దీనిని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ వ్యాధి ఇతర లక్షణాలు.. పాదాల్లో తిమ్మిరి, గోర్లు నెమ్మదిగా పెరగడం, పాదాలు పసుపు రంగులోకి మారడం, కండరాల నొప్పి వంటివి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి..

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మీరు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించాలి. మీరు ఎక్కువ కొవ్వు కలిగి ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇది కాకుండా ధూమపానానికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అధిక కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది. అందుకే వ్యాయామాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..