AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Calcium Rich Food: విరిగిన ఎముకలు త్వరగా అతికే టిప్ ఇదే.. ఈ 5 ఆహారాలను తింటే బలంగా మారుతాయి.. అవేంటంటే..

Calcium For Bone Health: ఎముకలు లేని మన శరీరంలోని ఊహించడం కష్టం. అందుకే మనం శరీరాన్ని బలంగా ఉంచుకునేందుకు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.

Calcium Rich Food: విరిగిన ఎముకలు త్వరగా అతికే టిప్ ఇదే.. ఈ 5 ఆహారాలను తింటే బలంగా మారుతాయి.. అవేంటంటే..
Calcium For Bone Health
Sanjay Kasula
|

Updated on: Sep 11, 2022 | 6:01 PM

Share

ఎముకల బలం మన శరీరానికి చాలా ముఖ్యం. ఎముకల్లో బలం లేకపోతే మన శరీరం పూర్తిగా బలహీనమవుతుంది. దీని కోసం కాల్షియం ఆధారిత ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. మన శరీరంలో 99 శాతం కాల్షియం ఎముకలలో.. 1 శాతం దంతాలలో ఉంటుంది. ఈ ప్రత్యేక పోషకం మన కండరాలు, రక్త నాళాలు, గుండెకు కూడా ప్రభావితం చేస్తుంది. మీరు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలు విరిగిపోయే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఈ పోషకాలు లేని ఆహార పదార్థాలు ఏవో తినడం ద్వారా తెలుసుకుందాం. 

వీటిని తింటే కాల్షియం అందుతుంది

1. పాల ఉత్పత్తులు

మీ ఎముకలను దృఢంగా ఉంచుకోవాలని అనుకుంటే పాలు, పాలతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం మొదలు పెట్టండి. పాలు, పెరుగు, జున్ను వంటి వాటిని తప్పనిసరిగా తినాలి. వాటి ద్వారా మీరు బలం పొందుతారు. 

2. బాదంపప్పు

బాదం తినడం వల్ల మెదడుకు పదును పెరుగుతుందని మీరు చాలా సార్లు వినే ఉంటారు. అయితే ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉన్నందున దీనిని తినడం వల్ల ఎముకలకు విపరీతమైన బలాన్ని ఇస్తుంది. అయితే బాదం తింటున్నప్పుడు కేవలం నానబెట్టిన బాదం మాత్రమే తింటే మంచిది.

3. సోయా బీన్స్

సోయాబీన్స్ సాధారణంగా ప్రోటీన్ పొందడానికి తింటారు. అయితే దీని ద్వారా మీరు ఎముకలను కూడా బలోపేతం చేసుకోవచ్చు. మీరు సోయా చంక్స్, సోయా పాలు లేదా టోఫు కూడా తింటే మంచిది. 

4. ఉసిరి

ఉసిరిలో అధికంగా విటమిన్ సి ఉంటుంది. ఇది మన జుట్టు, చర్మాన్ని మెరుగుపరుస్తుంది. అయితే ఇది కాల్షియం మంచి మూలం అని చెప్పవచ్చు. ఇది శరీరాన్ని బలంగా మార్చుతుంది.

5. జీలకర్ర

జీలకర్ర మన ఇళ్లలో క్రమం తప్పకుండా ఉపయోగించే మసాలా దినుసులలో ఒకటి. కాల్షియం పొందడానికి మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ జీలకర్రను రోజుకు నాలుగు సార్లు త్రాగండి. జీర్ణ శక్తి పెరుగుతుంది.. క్యాల్షింయ కూడా శరీరానికి అందుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..