Health Tips: పొట్ట శుభ్రంగా లేకపోతే ఎన్నో సమస్యలు చుట్టుముట్టినట్లే.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేసుకోండి..

పెద్దప్రేగు శుభ్రంగా ఉంటే అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. పొట్టను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల శరీరంలోని జీవక్రియ వ్యవస్థ పుంజుకుంటుంది.

Health Tips: పొట్ట శుభ్రంగా లేకపోతే ఎన్నో సమస్యలు చుట్టుముట్టినట్లే.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేసుకోండి..
Health Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 11, 2022 | 5:46 PM

Stomach Cleaning Tips: శరీరంలో కొన్ని లక్షణాలను బట్టి అనారోగ్య సమస్యలను అంచనా వేయవచ్చు. మనిషి ఉదరం (కడుపు) బాగా ఉంటే అతని శరీరం ఆరోగ్యంగా ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటారు. జీర్ణక్రియను సరిగ్గా ఉంచడానికి పెద్ద ప్రేగు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే పెద్దప్రేగు, చిన్న ప్రేగులను (ప్రేగులను) ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. లేకపోతే అనేక వ్యాధులు సంభవిస్తాయి. పెద్దప్రేగులో చాలా విషపూరితమైన అనవసర పదార్థాలు పేరుకుపోవడం వల్ల ఇది జరుగుతుంది. దీని కారణంగా, శరీరాన్ని పలు రకాల వ్యాధులు ఇబ్బందులకు గురిచేస్తాయి. పెద్దప్రేగు శుభ్రంగా ఉంటే అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. పొట్టను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల శరీరంలోని జీవక్రియ వ్యవస్థ పుంజుకుంటుంది. కావున పొట్టను సహజంగా ఎలా శుభ్రం చేసుకోవచ్చు.. దీనికోసం ఎలాంటి పదార్థాలను తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గోరువెచ్చని నీరు: పేగులను శుభ్రంగా ఉంచడంలో గోరువెచ్చని నీరు ఎంతో మేలు చేస్తుంది. మీరు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత కనీసం 2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. సహజంగా పొట్టను శుభ్రం చేయడానికి ఇది చాలా మంచి మార్గం.

పాలు: పాలు పేగులను సరిగ్గా శుభ్రపరుస్తుంది. ప్రతిరోజూ ఉదయం అల్పాహారంలో తప్పనిసరిగా ఒక గ్లాసు పాలు తాగాలి. పాలలో కాల్షియం ఉంటుంది. ఇది మన ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

వెజిటబుల్ జ్యూస్: వెజిటబుల్ జ్యూస్ తాగడం వల్ల పేగులు శుభ్రమవుతాయి. విషపదార్థాలు మొత్తం తొలగిపోతాయి. బీట్‌రూట్, కాకరకాయ, అల్లం, పొట్లకాయ, టమోటా, బచ్చలికూర మొదలైన కూరగాయలతో జ్యూస్ తయారు చేసుకోని తాగవచ్చు.

అధిక ఫైబర్: ఆహారంలో యాపిల్, ఆరెంజ్, దోసకాయ లేదా కలబంద వంటి అధిక ఫైబర్ ఆహారాలను చేర్చుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం కడుపుని మంచిగా శుభ్రపరుస్తుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!