Health: చలి.. హృద్రోగులకే కాదు, వారికి కూడా ముప్పే. హెచ్చరిస్తున్న నిపుణులు..
చల్లని వాతావరణం రక్తనాళాలను పరిమితం చేయడం వల్ల రక్తపోటు పెరుగుతంది. ఇది గుండెపోటుకు కారణంగా మారుతుంది. అందుకే చలికాలంలో క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వెచ్చగా ఉండేలా చూసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు...

చలి తీవత్రవ వణికిస్తోంది. రోజురోజుకీ పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక చలికాలం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. వీటిలో ప్రధానమైంది గుండెపోటు అని తెలిసిందే. హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు చలికాలం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. చాలా అధ్యయనాల్లో కూడా ఈ విషయం వెల్లడైంది. ఇతర కాలాలతో పోల్చితే చలికాలం గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
చల్లని వాతావరణం రక్తనాళాలను పరిమితం చేయడం వల్ల రక్తపోటు పెరుగుతంది. ఇది గుండెపోటుకు కారణంగా మారుతుంది. అందుకే చలికాలంలో క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వెచ్చగా ఉండేలా చూసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరియు తగినంత వెచ్చదనంతో ఉండడం ద్వారా గుండె ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు ప్రజలకు సూచించారు. చురుకునైన జీవనశైలిని అవలంభిస్తూ, గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే చలికాలం కేవలం హృద్రోగులకే కాకుండా కంటి సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కూడా ముప్పేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆర్బిస్ ఇంటర్నేషనల్ కంట్రీ డైరెక్టర్ డాక్టర్ రిషి రాజ్ బోరా శీతాకాలంలో కంటి సంరక్షణ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పొడిగాలి, ఇంట్లో వేడి కోసం ఏర్పాటు చేసుకునే ఏర్పాట్లు కారణంగా కళ్లు పొడిబారడం, చికాకుతో పాటు తీవ్రమైన పరిస్థితులకు దారి తీస్తుందని చెప్పుకొచ్చారు.
వింటర్‌లో కంటి ఆరోగ్యంపై కూడా దృష్టిసారించాలని తెలిపిన రిషి.. కళ్లు ఎప్పుడూ హూడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలన్నారు. ఇందుకోసం రోజూ తగినంత నీటిని తీసుకోవాలని తెలిపారు. చలిలో ప్రయాణం చేస్తున్న సమయంలో కళ్ల జోడ్లు వాడాలని, నేరుగా కంటికి గాలి తగలకుండా చూసుకోవాలని సూచించారు. ఇక కంటికి సంబంధించిన నిత్యం చెకప్‌లు చేసుకుంటూ, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..