Heart Health: ఇవి బాగుంటే మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్లే.. ఓసారి చెక్ చేసుకోండి
ఇలాంటి సంఘటనల నేపథ్యంలో గుండె ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. పలువురు ఆరోగ్య నిపుణులు సైతం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. మొదటి నుంచే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుంటే, హృద్రోగాల బారిన పడకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా మన గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలసుకోవచ్చని అంటున్నారు...

ఇటీవల గుండెపోటు కారణంగా మరణాలు పెరుగుతోన్న విషయం తెలిసిందే. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా హృద్రోగ సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. చిన్న వయసు వారు కూడా హార్ట్ ఎటాక్ బారిన పడుతుండడం అందరినీ ఆందోళన గురి చేస్తోంది.
ఇలాంటి సంఘటనల నేపథ్యంలో గుండె ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. పలువురు ఆరోగ్య నిపుణులు సైతం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. మొదటి నుంచే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుంటే, హృద్రోగాల బారిన పడకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా మన గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలసుకోవచ్చని అంటున్నారు. ఇంతకీ ఆ అంశాలు ఏంటంటే..
* గుండె పోటు రావడానికి ప్రధాన కారణాల్లో రక్తపోటు ఒకటి. గుండె పోటు వచ్చిన వారిలో తొలుత కనిపించేది రక్తపోటు సమస్యే. అందుకే రెగ్యులర్‌గా బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే రక్తపోటు సరిగ్గా ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన రక్తపోటు ఉంటే గుండె జబ్బులు వచ్చే సమస్యలను తగ్గిస్తాయని చెబుతున్నారు.
* గుండె కొట్టుకునే విధానం కూడా భవిష్యత్తులో గుండెపోటు వచ్చేందుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. గుండె కొట్టుకునే వేగం కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. నెమ్మది లేదా వేగవంతమైన హృదయ స్పందన రేటు గుండె ఆరోగ్యాన్ని చూపిస్తుంది. గుండె కొట్టుకునే వేగాన్ని బట్టి దాని ఆరోగ్యం తెలిసిపోతుంది.
* రక్త పరీక్ష ద్వారా కూడా ఆరోగ్యాన్ని తెలసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో సోడియం, పొటాషియం, క్రియేటినిన్ వంటివి ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేయించుకోవాలి. రక్తంలో వీటి స్థాయిలను ఆధారంగా గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చని వైద్యులు చెబుతున్నారు.
* శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఫలకాలు ఏర్పడుతాయి. ఇది గుండె పోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంచుకోవడం చాలా ముఖ్యం. రక్తపరీక్ష ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తెలుసుకొని అందుకు అనుగుణంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తీసుకునే ఆహారంలో కచ్చితంగా మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సమతుల్య ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. రోజులో కచ్చితంగా వాకింగ్, చిన్న చిన్న వ్యాయామాలు అయినా చేయాలి. చెడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలని చెబుతున్నారు. ఇక ఆహారంలో కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకుంటూ నూనెతో తయారు చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందించినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..