Salt and Sugar: శరీరం సరైన పనితీరులో ఉప్పు, చక్కెర ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ రెండింటిలో ఏది ఎక్కువైనా వ్యాధుల బారిన పడతాం. షుగర్ ఎక్కువగా ఉంటే మధుమేహం(Diabetes), ఉప్పు అధికంగా ఉంటే అధిక రక్తపోటు (Blood Pressure ) వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది…ఈ విషయం అందరికీ తెల్సిందే. అయితే మీరు తినే ఆహారంలో ఉప్పు, షుగర్ ను మానివేసినా.. శరీరానికి తగిన మొత్తంలో ఇవి అందక పోయినా అంతే ప్రమాదకరమని మీకు తెలుసా?
బెంగుళూరులోని మణిపాల్ హాస్పిటల్ యశ్వంత్‌పూర్ ఎండోక్రినాలజిస్ట్, కన్సల్టెంట్ డాక్టర్ రాజేశ్వరి జానకిరామన్ న్యూస్ 9 తో మాట్లాడుతూ.. ” అధికం ఏదైనా సరే శరీరానికి మంచిది కాదు, చక్కెర, ఉప్పు ఉపయోగాన్ని పూర్తిగా మానివేయడం వలన కూడా శరీరానికి హాని కలుగుతుంది. అయితే తేనె, పంచదార వంటి తీపి పదార్ధాలను దూరంగా ఉంచవచ్చు. అయితే బెల్లం, ఉప్పుని పూర్తిగా మానివేయడం ఆరోగ్యానికి హానికరం. శరీరం చక్కెరను సంక్లిష్ట పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వును విచ్ఛిన్నం చేసి గ్లూకోజ్‌గా మారుస్తుంది. ఇది శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. ఉప్పు విషయానికి వస్తేకూడా శరీరం ఇదే చర్యలను చేస్తుందని డాక్టర్ జానకిరామన్ వివరించారు.శరీరానికి కొంత మొత్తంలో ఉప్పు అవసరమని జానకిరామన్ చెప్పారు.
“ఒక వ్యక్తి ఆకు కూరలు తినడం లేదా తినే ఆహారంలో సోడియం చేర్చుకోవడం ద్వారా ఉప్పు పొందవచ్చు. భారతదేశం ఒక ఉష్ణమండల దేశం. చాలా మంది ప్రజలు ఎండలో పని చేస్తారు. దీంతో అధికంగా చెమటలు పడతాయి. దీంతో శరీరంలోని నీరు, ఉప్పుని కోల్పోతుంది. ఇది ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీస్తుంది, ముఖ్యంగా దీర్ఘకాలిక విరేచనాలు, అంతర్లీన ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణం కావచ్చు. అయితే ప్రజలు అధిక మొత్తంలో ఉప్పుని తీసుకోవడం, నీరు తాగడం వలన కూడా శరీరానికి హాని జరుగుతుందని డాక్టర్ జానకిరామన్ చెప్పారు.
శరీరంలో తక్కువ ఉప్పు శాతం ఉంటే హైపోనట్రేమియాకు దారితీస్తుంది. శరీరంలోని ఉప్పు సాధారణ పరిధి 135-145 mEq/L కంటే తక్కువగా ఉన్నప్పుడు హైపోనట్రేమియాకు దారి తీస్తుంది. “ఇది గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవాలని సూచించారు. లేదంటే కండరాల తిమ్మిరి, వికారం, వాంతులు, తల తిరగడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో దిక్కుతోచని స్థితికి చేరుకుంటారు. ఒకొక్కసారి ఉప్పు శరీరానికి తగినంత లేకపోతే.. షాక్, కోమాకి చేరుకుంటారు. ఒకొక్కసారి మరణానికి కూడా దారితీస్తుందని” డాక్టర్ జానకిరామన్ చెప్పారు.
అయితే ఉప్పుకి, సోడియంకి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం అని డాక్టర్ జానకిరామన్ అన్నారు. “మనం ఉప్పు లేదా సోడియం ఉపయోగించినప్పుడు తరచుగా గందరగోళానికి గురవుతాము. ఈ రెండు చాలా భిన్నంగా ఉంటాయి. ఉప్పు (సోడియం క్లోరైడ్) అనేది ప్రకృతిలో కనిపించే ఒక క్రిస్టల్ లాంటి సమ్మేళనం. సోడియం ఒక ఖనిజం. ఇది ఉప్పులో కనిపించే రసాయన మూలకాలలో ఒకటి” అని డాక్టర్ జానకిరామన్ చెప్పారు. .
అందువల్ల ఉప్పు తక్కువగా ఉండాలని డాక్టర్లు సూచిస్తే.. వారు తినే ఆహారంలో ఉప్పును పూర్తిగా మానకుండా తగిన మొత్తంలో తీసుకోవాలని సూచించారు. ఒక వ్యక్తి రోజుకు ఐదు గ్రాముల ఉప్పును కలిగి ఉండాలని సిఫార్సు చేస్తున్నారు. రోగికి ఉప్పు తీసుకోకూడదని సూచించినట్లయితే, వారు తప్పనిసరిగా.. ప్రత్యామ్నాయం కోసం వైద్యులను సంప్రదించాలని” డాక్టర్ జానకిరామన్ చెప్పారు. (Source)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..