Egg Benefits: గుడ్డులో గుండెకు మేలుచేసే ఎన్నో పోషకాలు.. తాజా పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి..

Egg Benefits: ప్రతి రోజు ఓ యాపిల్‌ పండు తింటే డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెబుతుంటారు. అలాగే రోజుకో గుడ్డు తింటే కూడా వ్యాధులకు దూరంగా..

Egg Benefits: గుడ్డులో గుండెకు మేలుచేసే ఎన్నో పోషకాలు.. తాజా పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి..
Egg Benefits

Egg Benefits: ప్రతి రోజు ఓ యాపిల్‌ పండు తింటే డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెబుతుంటారు. అలాగే రోజుకో గుడ్డు తింటే కూడా వ్యాధులకు దూరంగా ఉండవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుంద‌నే అపోహ‌తో ఎగ్‌ను తీసుకోని వారు ఎలాంటి భ‌యాలు లేకుండా తినవ‌చ్చ‌ని, గుడ్డుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ చెబుతోంది. అయితే అన్ని పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందంటే.. అది ఒక్క గుడ్డు. అందుకే గుడ్డును ఆరోగ్యానికి మంచిందని అందరికి తెలిసిందే. ఆరోగ్యం కోసం రోజుకొక గుడ్డును తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు. గుడ్డులో తొమ్మిది రకాల ప్రోటిన్లు, శరీరానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు అనేకం ఉన్నాయి. అందుకే గుడ్డు శరీరానికి మల్టీ విటమిన్‌గా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. అయితే కొంతమంది గుడ్డుని ఉడక బెట్టుకుని తింటే.. మరికొందరు ఆమ్లెట్, కూరలు వంటివి చేసుకుని తింటారు. కొంతమంది గుడ్డులోని తెల్లని సొనని తిని.. పచ్చని సొన పడేస్తుంటారు. ఇంకొందరు ఉడకబెట్టి గుడ్డుని తింటే.. మరికొందరు పచ్చిగా తింటారు. ఇలా రకరకాలుగా తింటుంటారు. అయితే పచ్చిగా కోడిగుడ్డు తీసుకోవడం మంచిదా చెడ్డదా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా అనే సందేహం చాలామందిలో వస్తుంటుంది.

గుండెకు మేలు:

ప్రతి రోజూ గుడ్డు తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ పెరుగుతుంద‌ని, ఇది గుండెకు మేలు చేకూరుస్తుంద‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ వెల్ల‌డించింది. నిత్యం గుడ్డు తీసుకోవ‌డం ద్వారా ప‌లు గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చని చెబుతోంది.

కంటి ఆరోగ్యానికి..

ఇప్పుడున్న కాలంలో చిన్న నుంచి కంటి సమస్యలు వస్తున్నాయి. స్కూల్‌కు వెళ్లే రోజుల్లో కింటి అద్దాలు వచ్చేస్తున్నాయి. వ‌య‌సు పెరిగే కొద్ది కంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతుంటాయి. గుడ్డులో ఉండే లుటిన్‌, జెక్సాన్‌ధిన్ వంటివి కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే యాంటీఆక్సిడెంట్ల‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే గుడ్డులో ప్రొటీన్ పుష్క‌లంగా ఉండ‌టంతో శ‌రీర నిర్మాణం, ఎముక‌లు, కండ‌రాల పుష్టికి ఎంతగానో దోహదం చేస్తుంది. రోజువారీ మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ప్రొటీన్‌ను గుడ్డు అందించ‌డం ద్వారా రోజంతా చురుకుగా ఉండేలా చేస్తుంది. ఇక గుడ్డు తీసుకోవ‌డం ద్వారా శ‌రీరంలో జీవ‌క్రియ‌లు వేగ‌వంత‌మై బ‌రువు త‌గ్గేందుకూ ఇది దారితీస్తుంది.

నరాల బలహీనతలకు..

గుడ్డులోని ఐరన్‌ని శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఐరన్‌ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది. జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్డులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతుంది. గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి. అలానే నరాల బలహీనత ఉన్న వారు రోజూ గుడ్డును తీసుకోవాలి. ఇది నరాల బలహీనత తగ్గేలా చేస్తుంది. గుండె జబ్బుల నివారణకు తోడ్పడుతుంది. ఉడకబెట్టిన గుడ్డు వల్ల జీర్ణ సమస్య దూరం అవుతుంది. ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి.

ఇవీ కూడా చదవండి:

Guava Health Benefits: జామ, ఆకులతో ఇన్ని ఉపయోగాలా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు.. పూర్తి వివరాలు..!

Psychological Stress: మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారా..? ఒత్తిళ్లను జయించే చిట్కాలు..!

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu