AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton and Fish Benefits: నాన్ వెజ్ లో వీటిని తింటే భలే బెనిఫిట్స్.. రక్త హీనతకు చెక్ పెట్టవచ్చు!!

ఈ రోజుల్లా చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. సమయానికి తినకపోవడం, శరీరానికి తగినన్ని విటమిన్లు, మినరల్స్, పోషకాలు అందకపోవడం, సరైన ఆహారం తినకపోవడం కారణం ఏదైనా.. రక్తలేమి లేదా రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఎక్కువగా ఉంటున్నారు. శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల ఎర్రరక్తకణాలు తగ్గుతాయి. ఫలితంగా రక్తం స్థానాన్ని నీరు ఆక్రమించి.. శరీరం బరువుగా అనిపించడం, కాళ్లు తిమ్మిర్లు పట్టడం, కళ్లు తిరగడం, మీ పనులు కూడా మీరు చేసుకోలేకపోవడం..

Mutton and Fish Benefits: నాన్ వెజ్ లో వీటిని తింటే భలే బెనిఫిట్స్.. రక్త హీనతకు చెక్ పెట్టవచ్చు!!
Fish And Mutton
Chinni Enni
|

Updated on: Aug 12, 2023 | 9:46 PM

Share

ఈ కాలంలో మనకు ఉండే ఆరోగ్యాలు అంతంత మాత్రం. వాటిని కూడా నాసిరకం తిండి తింటూ.. ఏ ఆయిల్ తో తయారు చేస్తున్నారో కూడా తెలియని ఫ్రైడ్ రైస్ లు, న్యూడిల్స్ తింటూ అనారోగ్యాల పాలు చేసేస్తున్నాం. ఏదైనా సమస్య రాకుండానే చూసుకోవాలి. ఒక్కసారి వచ్చిందంటే.. దాని నుంచి బయటపడటం అంత ఈజీ కాదు. అనారోగ్యం నుంచి కోలుకోవడం అంటే.. చాలా సమయం పడుతుంది. దానికంటే అంతోఇంతో ఉన్న ఆరోగ్యాన్నే కంటికిరెప్పలా కాపాడుకుంటూ ఏ బెడద ఉండదు.

ఇక అసలు విషయానికొస్తే.. ఈ రోజుల్లా చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. సమయానికి తినకపోవడం, శరీరానికి తగినన్ని విటమిన్లు, మినరల్స్, పోషకాలు అందకపోవడం, సరైన ఆహారం తినకపోవడం కారణం ఏదైనా.. రక్తలేమి లేదా రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఎక్కువగా ఉంటున్నారు. శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల ఎర్రరక్తకణాలు తగ్గుతాయి. ఫలితంగా రక్తం స్థానాన్ని నీరు ఆక్రమించి.. శరీరం బరువుగా అనిపించడం, కాళ్లు తిమ్మిర్లు పట్టడం, కళ్లు తిరగడం, మీ పనులు కూడా మీరు చేసుకోలేకపోవడం, ఎక్కువ అలసట, జుట్టురాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి 12, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాల లోపం కారణంగా కూడా రక్తహీనత సమస్య వస్తుంది.

రక్తహీనత సమస్యతో బాధపడేవారు కేవలం పండ్లే కాదు.. నాన్ వెజ్ తినడం ద్వారా కూడా ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. శరీరానికి ఎక్కువగా ఐరన్ అందించే నాన్ వెజ్ రకాలను తినడం ద్వారా రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. వాటిలో మొదటిది మటన్. మీరు చదివేది నిజమే. మటన్, మటన్ లివర్ ను వారానికి 2 లేదా మూడు సార్లు తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇవి లివర్ లో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమయ్యే ఐరన్ ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అలాగే చేపలు తినడం ద్వారా కూడా రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు. చేపల్లో 9 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. కొన్నిరకాల క్యాన్సర్లు కూడా రాకుండా కాపాడుతాయి. అలాగే రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా.. గుండెజబ్బులు రాకుండా ఉంటాయి. వీటిలో డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్ ను కూడా తగ్గిస్తాయి. చేపల్లోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ సరిగ్గా ఉండేలా చేస్తుంది. కాబట్టి రక్తహీనత సమస్య ఉన్నవారు ఈ నాన్ వెజ్ లను ట్రై చేయండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి