AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Circulation Precautions: బ్లడ్ సర్క్యూలేషన్ తో జాగ్రత్త.. ఈజీగా తీసుకుంటున్నారా.. చాలా డేంజర్!!

ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో రోగాలు ఎక్కువ.. సమయం తక్కువ. ఎవరిని కదిలించినా.. ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నామనే చెబుతారు. అలాగే ప్రస్తుతం డయాబెటీస్, బీపీ వంటివి ఎంత సాధారణమైనవో.. అలాగే రక్త ప్రసరణలో వచ్చే సమస్యలు కూడా అంతే. షుగర్, రెనాడ్స్, అధిక బరువు వంటి అనారోగ్యాల కారణంగా చాలా మందికి రక్త ప్రసరణ సరిగా జరగడం లేదు. రక్త ప్రసరణ స్లోగా ఉంటే అనేక వ్యాధుల బారిన పడుతూంటాం. జీర్ణ సమస్యలు, చేతుల్లో, కాళ్లల్లో తిమ్మిర్లు..

Blood Circulation Precautions: బ్లడ్ సర్క్యూలేషన్ తో జాగ్రత్త.. ఈజీగా తీసుకుంటున్నారా.. చాలా డేంజర్!!
Blood Circulation
Chinni Enni
|

Updated on: Aug 12, 2023 | 3:59 PM

Share

ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో రోగాలు ఎక్కువ.. సమయం తక్కువ. ఎవరిని కదిలించినా.. ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నామనే చెబుతారు. అలాగే ప్రస్తుతం డయాబెటీస్, బీపీ వంటివి ఎంత సాధారణమైనవో.. అలాగే రక్త ప్రసరణలో వచ్చే సమస్యలు కూడా అంతే. షుగర్, రెనాడ్స్, అధిక బరువు వంటి అనారోగ్యాల కారణంగా చాలా మందికి రక్త ప్రసరణ సరిగా జరగడం లేదు. రక్త ప్రసరణ స్లోగా ఉంటే అనేక వ్యాధుల బారిన పడుతూంటాం. జీర్ణ సమస్యలు, చేతుల్లో, కాళ్లల్లో తిమ్మిర్లు, ఒళ్లు చల్లబటం, కండరాల తిమ్మిరి, కండరాల నొప్పులు ఇవన్నీ రక్త ప్రసరణ సరిగా లేకపోవడం కారణంగానే జరుగుతూంటాయి. అయితే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. రక్త ప్రసరణ పెంచే ఆహారం తీసుకుంటే వాటి నుంచి కాస్త మేలు జరుగుతుంది. అలాగే ఈ టిప్స్ కూడా మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. మీరు మీకు సంబంధించిన వర్క్ చేసుకుంటూనే వీటి కూడా పాటిస్తే సరి. మరి ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా.

ఫిజికల్ యాక్టివిటీ:

రక్త ప్రసరణ బాగా జరగాలంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉండాలి. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ గా జరిగేందుకు హెల్ప్ చేస్తుంది. రోజుకు కనీసం ఓ అరగంట సేపైనా వాకింక్, జాగింక్, స్విమ్మింగ్, సైక్లింగ్ లేదా నార్మల్ వ్యాయామాలు చేసినా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలా చేయడం రోజంతా యాక్టీవ్ గా కూడా ఉంటారు.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యకరమైన డైట్:

మనం తీసుకునే ఆహారమే రక్త ప్రసరణలో ముఖ్య పాత్ర వహిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, తృణ ధాన్యాలు వంటివి అధికంగా ఉన్న ఆహారాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే విటమిన్ కే, విటమిన్ సీ, విటమిన్ ఇ వంటికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ కి సహాయం అందిస్తాయి.

శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచుకోవాలి:

బాడీ ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంటేనే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. శరీరం ఎప్పుడూ కూడా డ్రీ హైడ్రేషన్ కి గురి కాకుండా చూసుకోవాలి. లేదంటే సమస్యలు వెతుక్కుంటూ మీ దగ్గరకి వస్తాయి. నీరు, నీరు శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకుంటూ ఉండాలి.

ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉండాలి:

రక్త ప్రసరణ మెరుగ్గా ఉండేందుకు ఒత్తిడి, ఆందోళనలకు సాధ్యమైనంతగా దూరంగా ఉండాలి. ఒత్తిడి వల్ల శరీరం అలసటకు గురవుతుంది. మెదడు సరిగ్గా పని చేయదు. దీనివల్ల గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిత్యం కుదరకపోయినా.. అప్పుడప్పుడైనా ధాన్యం, ఊపిరి గట్టిగా పీల్చడం, చెట్ల మధ్య కాస్త సమయం గడుపుతూ ఉండాలి.

కాళ్లను పైకి లేపడం:

ఉద్యోగ సమయాల్లో ఎక్కువ సేపు కూర్చొని ఉండటం వలన కూడా రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. అందుకే అప్పుడు లేచి అలా నడుస్తూ ఉండాలి. అలాగే మీరు ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో మీ కాళ్లను అప్పుడప్పుడూ పైకి లేపడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. మీరు వర్క్ హాలిక్ అయితే మాత్రం కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి