Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drinking Water Rules: నీటిని తాగడానికి తగిన సమయం, కొన్ని నియమాలున్నాయి.. ఆయుర్వేదంప్రకారం ఎప్పుడు తాగాలంటే..

నీరు మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరం నుండి విషాన్ని బయటకు పంపడం ద్వారా శరీరాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ తగిన మోతాదులో నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. అంతే కాదు సరైన మోతాదులో నీటిని తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం నీరు త్రాగడానికి సరైన నియమం ఏమిటంటే?

Drinking Water Rules: నీటిని తాగడానికి తగిన సమయం, కొన్ని నియమాలున్నాయి.. ఆయుర్వేదంప్రకారం ఎప్పుడు తాగాలంటే..
Drinking Water
Follow us
Surya Kala

|

Updated on: Nov 04, 2023 | 9:36 AM

రోజంతా చురుగ్గా ఉంటూ ఆరోగ్యంగా ఉండడానికి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం పౌష్టికాహారం ఎంత ముఖ్యమో, తగినంత నీరు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని నిప్పులు చెబుతూ ఉంటారు. కనుక చాలా మంది ప్రతిరోజూ నీరు ఎక్కువగా తాగుతుంటారు. అయితే చాలా మందికి ఎప్పుడు, ఎలా, ఎంత నీరు తాగాలి అనే విషయం తెలియదు. ఆయుర్వేదం ప్రకారం నీరు త్రాగడానికి సరైన నియమం.. సమయం ఉంది . ఈ నియమం ప్రకారం నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి నీరు త్రాగడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం.

తాగునీరు ఎందుకు ముఖ్యం?

నీరు మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరం నుండి విషాన్ని బయటకు పంపడం ద్వారా శరీరాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ తగిన మోతాదులో నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. అంతే కాదు సరైన మోతాదులో నీటిని తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

ఆయుర్వేదం ప్రకారం నీరు త్రాగడానికి సరైన నియమం ఏమిటంటే?

ఆయుర్వేదం ప్రకారం నిలబడి నీళ్లు తాగకూడదు. నిలబడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి హానికరం. కనుక  ఎప్పుడూ కూర్చొని నీళ్లు తాగాలి. ఇలా నీరు తాగడం వలన ఆ నీటిని శరీరం బాగా గ్రహిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎల్లప్పుడూ గోరువెచ్చని లేదా గది ఉష్ణోగ్రత నీటిని త్రాగాలి. రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన చల్లటి నీటిని తాగవద్దు. ఆయుర్వేదం ప్రకారం, చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.

ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో 1 గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగాలి. ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం ప్లాస్టిక్ బాటిళ్లలోని నీరు బదులుగా రాగి పాత్రలో నీరు త్రాగాలి. రాగిలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి నీటిలోని హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను చంపడంలో సహాయపడతాయి. అదనంగా కాపర్ అయాన్లు శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతాయి.

ఒకేసారి ఎక్కువ నీరు తాగకూడదు. నీటిని సిప్ చేస్తూ నెమ్మదిగా త్రాగాలి. సిప్ బై సిప్ వాటర్ తాగడం వల్ల శరీరం నీటిని బాగా పీల్చుకుంటుంది.  ఇలా చేయడం వలన నిర్జలీకరణాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

ఆయుర్వేదం ప్రకారం ఎప్పుడు, ఎలా, ఎంత నీరు త్రాగాలి?

ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో 1 గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగాలి.

భోజనానికి ఒక గంట ముందు లేదా భోజనానికి ఒక గంట తర్వాత నీరు త్రాగాలి.

రాత్రి భోజనం చేసిన గంట తర్వాత నీళ్లు తాగాలి.

ఆయుర్వేదం ప్రకారం ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు నీరు త్రాగకూడదు. అలాగే రోజుకి 8 నుంచి 9 గ్లాసుల నీళ్లు తాగడం తప్పనిసరి. ఒకేసారి ఎక్కువ నీరు త్రాగకూడదు. క్రమమైన వ్యవధిలో 1 నుండి 1 ½ గంటల  వ్యవధిలో నీరు త్రాగాలి.

ఆయుర్వేదం ప్రకారం నీరు ఎప్పుడు తాగకూడదంటే ?

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం వేడి ఆహారం తిన్న వెంటనే నీరు త్రాగకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాగే దోసకాయ, పుచ్చకాయ మొదలైన పండ్లు, కూరగాయలు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..