హైబీపీ ఉంటే ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు.. గుండెపోటుకు సంకేతం కావచ్చు..
అధిక రక్తపోటు ఉన్న రోగులలో గుండెపోటు ప్రమాదం ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీ రక్తపోటు మీ వయస్సు కంటే ఎక్కువగా ఉంటే, గుండెపోటు ఈ ప్రారంభ సంకేతాలను చిన్నవిగా పరిగణించే పొరపాటు చేయకండి.. ఎందుకంటే.. ఇవి ప్రాణాంతకంగా మారవచ్చు.. కావున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి..

ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న సైలెంట్ కిల్లర్ డిసీజ్.. హైపర్ టెన్షన్.. అదే హైబీపీ (అధిక రక్తపోటు).. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కోట్లాది మంది ఈ హైపర్‌టెన్షన్ సమస్యతో బాధపడుతున్నారు. తలనొప్పి, ఆకస్మిక తలతిరుగుడు, ఊపిరి ఆడకపోవడం లేదా ఛాతీ నొప్పి వంటి సమస్యలు పెరుగుతున్నట్లయితే.. మీరు అధిక రక్తపోటు రోగి అయి ఉండవచ్చు. అయితే, ఈ లక్షణం వేరే వ్యాధి వల్ల కూడా రావచ్చు.. కావున వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. దీనితో పాటు, మీరు ఇంట్లోనే బిపి కొలిచే యంత్రంతో మీ బిపీ (రక్తపోటు) ని కూడా తనిఖీ చేసుకోవచ్చు. సిస్టోలిక్ పీడనం 180 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు లేదా డయాస్టొలిక్ పీడనం 110 లేదా అంతకంటే ఎక్కువకు చేరుకున్నప్పుడు.. హైబిపి నుండి గుండెపోటు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. 18 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల పెద్దల రక్తపోటు 120/80mm Hg కంటే తక్కువగా ఉండాలి. మీ రక్తపోటు 130/80 mm Hg అయితే, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.
అధిక రక్తపోటు గుండెకు ఎందుకు ప్రమాదకరం?..
బిపి అనేది శరీరంలోని అన్ని భాగాలను చేరుకోవడానికి రక్తం ఉపయోగించే ఒక రకమైన పీడనానికి సంబంధించినది. అటువంటి పరిస్థితిలో, అధిక రక్తపోటు కారణంగా, గుండెకు తగినంత విశ్రాంతి లభించదు. దీని కారణంగా హృదయ స్పందన పెరగడం ప్రారంభమవుతుంది.. ధమనులు బలహీనపడటం వలన, గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం వంటి ప్రాణాంతక పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది.
బిపి రోగులలో గుండెపోటు లక్షణాలు ఇవే..
ఛాతీ నొప్పి – ఛాతీలో భారం – బిగుతుగా ఉండటం: గుండెపోటుకు ముందు తీవ్రమైన ఛాతీ నొప్పి అత్యంత సాధారణ లక్షణం. సాధారణంగా ఈ నొప్పి ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపున అనుభూతి చెందుతుంది. ఈ నొప్పి ఛాతీలో భారంగా.. బిగుతుగా అనిపించవచ్చు.
గుండెపోటు నొప్పి ఎక్కడ వస్తుంది?
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. మీ చేతులు, మెడ, దవడ, కడుపులో నొప్పి లేదా అసౌకర్యం అనిపిస్తే, అది గుండెపోటుకు హెచ్చరిక సంకేతం కావచ్చు..
ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి.
ఛాతీ నొప్పి ఉన్నా లేకపోయినా, శ్వాస ఆడకపోవడం అనేది గుండెపై ఒత్తిడికి సంకేతం కావచ్చు. దీనితో పాటు, వికారం, తలతిరుగుతున్న భావన కూడా గుండెపోటు లక్షణాలే.. కావున ఇలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని.. వెంటనే వైద్యులను సంప్రదించాలని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




