ఎండాకాలంలో ప్రతిరోజూ ఎండుద్రాక్ష తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
ద్రాక్షలో రెండు రకాలు ఉంటాయి. ఎండబెట్టిన ద్రాక్ష, పచ్చి ద్రాక్ష.. ఈ రెండు ఆరోగ్యానికి చాలా మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఎండుద్రాక్షలో పోషకాలు కాస్త ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటిని ప్రస్తుతం చాలా మంది రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయమే పరగడుపున తీసుకుంటూ ఉన్నారు. దీనివల్ల చర్మానికి, జుట్టుకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎండాకాలంలో ఎండు ద్రాక్ష తినటం వల్ల ఎలా ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: May 05, 2025 | 10:28 AM

ఎండుద్రాక్షలో పొటాషియం, భాస్వరం, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్ ఎ, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్ రక్త పరిమాణాన్ని పెంచుతుంది, ఎండుద్రాక్షలో ఉండే ఫైబర్ కడుపులో గ్యాస్, ఆమ్లత్వం తగ్గిస్తుంది.

ఎండుద్రాక్షలోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనిలోని విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ఎండుద్రాక్ష తినాలి. ఎండుద్రాక్ష పోషక విలువల పరంగా చాలా గొప్పది.

ఎండుద్రాక్షలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ నానబెట్టి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మరింతగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

రక్తహీనతను నివారించడం ఎండుద్రాక్షలో పెద్ద మొత్తంలో ఐరన్ లభిస్తుంది. దీని వినియోగం హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. శరీరంలో రక్త లోపం ఉండదు. రక్తహీనతతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే ఎండు ద్రాక్షను తీసుకోవాలి.

అంతేకాదు..ఎండుద్రాక్ష గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎండుద్రాక్షలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తపోటును మెయింటెన్ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.




