Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jackfruit Health Benefits: పనస పండు తిన్న తర్వాత మరిచిపోయి కూడా వీటిని తినకండి.. అవేంటో తెలిస్తే షాక్ అవుతారు..

వేసవిలో మనకు విరివిగా దొరికే పండ్లలో పనసపండు ఒకటి. ఇందులో విటమిన్- ఎ, సి, బి6 లతో పాటు థియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, పైబర్ ను సమృద్దిగా ఉంటాయి.

Jackfruit Health Benefits: పనస పండు తిన్న తర్వాత మరిచిపోయి కూడా వీటిని తినకండి.. అవేంటో తెలిస్తే షాక్ అవుతారు..
Jack Fruit
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 25, 2022 | 5:56 PM

వేసవిలో మనకు విరివిగా దొరికే పండ్లలో పనసపండు(Jackfruit) ఒకటి. ఇందులో విటమిన్- ఎ, సి, బి6 లతో పాటు థియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, పైబర్ ను సమృద్దిగా ఉంటాయి. ప్రపంచంలోనే అతి పెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. దాదాపు ఒక్కోటి 36 కేజీలుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. దీని లోపల ఉండే తొనలు నోరూరిస్తాయి. ఇవి తియ్యగా  తినడానికి రుచిగా ఉంటాయి. ఈ పండు కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని సైతం మేలు చేస్తుంది. ఎన్నో ఔషద గుణాలు కలిగిన ఈ పండు కేవలం ఆసియా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ పండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

పనసపండు తినడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జాక్‌ఫ్రూట్ తీసుకోవడం వల్ల యాంటీఆక్సిడెంట్ సామర్థ్యం , లాక్టిక్ యాసిడ్ పెరుగుతుందని, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుందని అనేక పరిశోధనలలో వెల్లడైంది. ఐరన్‌తో కూడిన పనస పండు రక్తహీనత నుంచి రక్షిస్తుంది. జాక్‌ఫ్రూట్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

విటమిన్ బితో సమృద్ధిగా ఉన్న జాక్‌ఫ్రూట్ షుగర్ రోగులలో ఇన్సులిన్‌ను మెరుగుపరుస్తుంది. షుగర్ పేషెంట్లు యాంటీ డయాబెటిక్ గుణాలు పుష్కలంగా ఉన్న జాక్‌ఫ్రూట్‌ను తీసుకుంటే.. వారి మధుమేహం అదుపులో ఉంటుంది. అయితే జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత తినకూడనివి కొన్ని ఉన్నాయి. అవేంటో మనం తెలుసుకుందాం..

పాలు తాకండి: జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత పాలు తాగకండి. అంతే కాదు, పాలు తాగిన తర్వాత కూడా జాక్‌ఫ్రూట్ తినకూడదు. అలా చేస్తే ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది. మీరు ఇలా చేస్తే రింగ్‌వార్మ్, గజ్జి, దురద, తామర,  సోరియాసిస్ సమస్యలు వచ్చే అకాశం ఉంది.

తేనెను తీసుకోవద్దు: మీరు జాక్‌ఫ్రూట్‌తో తేనెను తీసుకుంటే అది మీ ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. పనస పండు తిన్న తర్వాత తేనె తీసుకుంటే శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది.

బొప్పాయిని కూడా తినకండి: జాక్‌ఫ్రూట్ తో చేసిన వంటలు కాని, పనస పండు కాని తిన్న తర్వాత బొప్పాయిని ఎప్పుడూ తినకూడదు.

పనస పండు తిన్న తర్వాత పాన్‌ను అస్సులు తినవద్దు:  చాలా మందికి భోజనం చేసిన తర్వాత పాన్ తినడం అలవాటు. అయితే పనస పండు తిన్న తర్వాత మాత్రం మరిచి పోయి కూడా తమలపాకు(కిల్లీ) తనవద్దు. పనస పండు తిన్న తర్వాత తమలపాకులు తింటే శరీరంలో అనేక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.

జాక్‌ఫ్రూట్‌తో బెండకాయను తినవద్దు: మీరు పనసపండు, బెండకాయలను తింటుంటే మంచిది. అలా చేయకండి ఎందుకంటే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో చర్మ సమస్యలు, శరీరంలో తెల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి: Yogi Adityanath Oath: రెండోసారి ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యానాథ్‌.. కొత్త మంత్రి వర్గంలో మంత్రులు వీరే..

Kishan Reddy: పుత్రవాత్సల్యంతోనే రైతుల్ని బలిచేస్తున్నారు.. కేసీఆర్ సర్కార్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం..