Nutmeg Health Benefits: జాజికాయలతో అద్భుతమైన ప్రయోజనాలు..!
Nutmeg Health Benefits: ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే ఎంతో మేలుంటుంది. ఇప్పుడున్న రోజులలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. జీవనశైలి,..
Nutmeg Health Benefits: ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే ఎంతో మేలుంటుంది. ఇప్పుడున్న రోజులలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, ఇతర కారణాల వల్ల ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇక జాజికాయలు (Nutmeg) అనేవి భారతీయులు పురాతన కాలం నుంచి పలు వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. జాజికాయలతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే జాజికాయల వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు (Health benefits) కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
- జాజికాయ పొడిని సూప్‌లలో వేసి తీసుకుంటే విరేచనాలు, మలబ్దకం, గ్యాస్ సమస్య, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
- జాజికాయ పొడిని ప్రతి రోజు తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు పదార్థం తొలగిపోతుంది. ఇవే కాకుండా గుండె జబ్బులున్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
- జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల దంతాలకు సంబంధించిన ఏవైనా సమస్యలుంటే తొలగిపోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. లివర్, కిడ్నీల్లో పేరుకుపోయే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
- జాజికాయ నూనె నొప్పులకు ఎంతగానో ఉపయోగపడనుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు.
- ఇక నిద్రలేమితో బాధపడుతున్న వారికి రాత్రి భోజనం సమయంలో పొడిని తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. అలాగే రక్త సరఫరా మెరుగు పడుతుంది.
- జాజికాయ పొడిలో కాల్షియం, ఐరన్, మాంగనీస్, పొటాషియం తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇవి ఆరోగ్య నిపుణుల సూచనలు, సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.)
ఇవి కూడా చదవండి: