సిగరెట్లు తాగితే మానసిక ఒత్తిడి తగ్గుతుందా..? నిపుణులు చెబుతున్న పచ్చి నిజం ఇదే..
ఉరుకులు పరుగుల జీవితం, చెడు జీవనశైలి కారణంగా ప్రజల మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆఫీసు ఒత్తిడి, వ్యక్తిగత జీవితంలో సమస్యల కారణంగా ప్రజల మానసిక ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. అయితే.. ఆఫీసుల్లో పనిచేసే చాలా మంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి సిగరెట్లను ఆశ్రయిస్తారు.

ఉరుకులు పరుగుల జీవితం, చెడు జీవనశైలి కారణంగా ప్రజల మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆఫీసు ఒత్తిడి, వ్యక్తిగత జీవితంలో సమస్యల కారణంగా ప్రజల మానసిక ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. అయితే.. ఆఫీసుల్లో పనిచేసే చాలా మంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి సిగరెట్లను ఆశ్రయిస్తారు. నిరంతర ధూమపానం వ్యసనానికి దారితీస్తుంది.. కొంతమంది అయితే.. రోజుకు 5 నుంచి 7 సిగరెట్లు.. మరికొంతమంది 10కిపైగా సిగరెట్లు తాగుతారు.. ఇలా చైన్ స్మోకర్లుగా మారుతారు..
అయితే.. సిగరెట్లు కాల్చడం వల్ల నిజంగా మానసిక ఒత్తిడి తగ్గుతుందా? ఎందుకు అలాంటి అనుభూతి చెందుతారు..? నిపుణులు ఏం చెబుతున్నారు.. ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకోండి..
వాస్తవానికి సిగరెట్లు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.. సిగరెట్లలో నికోటిన్ ఉంటుంది.. ఇది మెదడును ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి సిగరెట్ తాగినప్పుడు.. నికోటిన్ శరీరంలో డోపమైన్ (ఒక హార్మోన్) ను విడుదల చేస్తుంది.. ఇది ప్రజలను సంతోషంగా ఉండేలా ఉపశమనం కలిగిస్తుంది. అందుకే ఒక వ్యక్తి సిగరెట్ కాల్చిన తర్వాత కొన్ని క్షణాలు మంచిగా భావిస్తాడు. కానీ నికోటిన్ ప్రభావం తగ్గడం ప్రారంభించిన వెంటనే, ఆ వ్యక్తి మళ్ళీ అశాంతి, మానసిక ఒత్తిడిని అనుభవించడం ప్రారంభిస్తాడు.
సిగరెట్లు తాగడం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోతుందా?
ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఆస్తిక్ జోషి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. సిగరెట్ తాగడం వల్ల కొంతకాలం మంచి అనుభూతి కలుగుతుంది.. కానీ అది ఆరోగ్యానికి హానికరం అని అన్నారు. సిగరెట్లు తాగే అలవాటు క్రమంగా మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ఎందుకంటే నికోటిన్‌ను దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.. ఇది ఆందోళన, నిరాశ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
ప్రజలు ధూమపానం ఎందుకు మానేయలేరు..
చాలా కాలంగా ధూమపానం చేస్తున్న వ్యక్తి ధూమపానం మానేయడం అంత సులభం కాదని, ఎందుకంటే సిగరెట్లలో ఉండే నికోటిన్ వ్యసనంగా మారుతుందని డాక్టర్ జోషి అంటున్నారు. ఒక వ్యక్తి దానిని మానేయడానికి ప్రయత్నిస్తే, శరీరంలో నికోటిన్ లోపం ఏర్పడుతుంది.. దీని కారణంగా, చిరాకు, కోపం, అనేక ఇతర లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితిలో, ఆ వ్యక్తి ధూమపానం మానేయాలని కోరుకున్నా కూడా మానేయలేడు. ఇతర మందుల విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతుంది.
మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని ఆరోగ్యకరమైన ఎంపికలు..
నడక, వ్యాయామం లేదా ఏదైనా శారీరక శ్రమ చేయండి.
లోతైన శ్వాస వ్యాయామాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.
నిద్రపోయే – మేల్కొనే సమయాన్ని సెట్ చేయండి
బాగా నిద్రపోండి..
స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడండి..
పుస్తకాలు చదవండి.. లేదా ఇష్టమైన పనులను చేయండి..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..