నిమ్మరసం తాగితే మైగ్రేన్ తగ్గుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
ప్రస్తుతం మనలో చాలా మంది మైగ్రేన్ తో బాధపడుతున్నారు. ఎక్కువ గా వేడి, దాహం, ఆకలి, శబ్దం లాంటి వి దీనికి ముఖ్య కారణాలు. మామూలు టాబ్లెట్లు వాడినా తగ్గకపోవడంతో చాలా మంది ఇంట్లో నే కొన్ని సాధారణ చిట్కాలు ప్రయత్నిస్తున్నారు.

తలనొప్పితో బాధపడుతున్న సమయంలో నిమ్మరసం తాగితే వెంటనే నొప్పి తగ్గిందని కొంతమంది చెబుతున్నారు. అయితే ఇది అందరికీ పని చేస్తుందా అనే సందేశం అందరిలో ఉంది. ఆధునిక వైద్య పద్ధతిలో చూస్తే.. నిమ్మరసం తాగడం వల్ల మైగ్రేన్ తగ్గుతుందని ఎటువంటి ఆధారాలు లేవు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నిమ్మరసం తాగడం మైగ్రేన్ కు నేరుగా పరిష్కారం కాదు. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు కాబట్టి.. మైగ్రేన్ కు సరైన వైద్య సలహా తీసుకోవడం అవసరం. మైగ్రేన్ ను తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- మైగ్రేన్ ఉన్న చోట చల్లటి ఐస్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు.
- కాళ్లను వేడి నీటిలో కొద్దిసేపు ముంచడం కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది.
మైగ్రేన్ కు కారణాన్ని ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల కొందరికి మైగ్రేన్ వస్తుంది. అటువంటి సందర్భాల్లో నేరుగా సూర్యకాంతిని తగలకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు గ్లాసులు, టోపీ లేదా గొడుగు లాంటివి తప్పనిసరిగా వాడాలి.
స్క్రీన్ టైమ్ ఎక్కువైనా మైగ్రేన్ రావొచ్చు. మొబైల్ ఫోన్ లు, ల్యాప్ టాప్ లు ఎక్కువసేపు చూస్తే కళ్ళకు ఒత్తిడి ఏర్పడి మైగ్రేన్ వస్తుంది. హెడ్ ఫోన్ లు పెట్టుకుని ఎక్కువసేపు సంగీతం వింటే కూడా నెమ్మదిగా మైగ్రేన్ రావచ్చు.
నిమ్మరసం తాగడం వల్ల మైగ్రేన్ తగ్గుతుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. దయచేసి డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి ఇంటి చిట్కాలు ప్రయత్నించొద్దు. ఎలాంటి ఆరోగ్య సమస్యకైనా సరైన వైద్యుని సలహా తీసుకుని మాత్రమే చికిత్స తీసుకోవడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)