Chewing Gum: చూయింగ్ గమ్ నమలడం వల్ల బరువు తగ్గుతారా? నిపుణులు ఏమంటున్నారంటే?
Chewing Gum Benefits: మనలో చాలామందికి చూయింగ్ గమ్ నమిలే అలవాటు ఉంటుంది. టైంపాస్ అనో, మౌత్ ఫ్రెషనర్ అనో ఏదో ఒక రకంగా దీనిని నములుతూ ఉంటారు. ఈ అలవాటు ఒక విధంగా ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా చేస్తుంది.

Chewing Gum Benefits: మనలో చాలామందికి చూయింగ్ గమ్ నమిలే అలవాటు ఉంటుంది. టైంపాస్ అనో, మౌత్ ఫ్రెషనర్ అనో ఏదో ఒక రకంగా దీనిని నములుతూ ఉంటారు. ఈ అలవాటు ఒక విధంగా ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా చేస్తుంది. ముఖ్యంగా మననోటికి మంచి వ్యాయామం లభించడమే కాకుండా మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగపడుతుంది. అలాగే స్మోకింగ్ అలవాటును మానేసేలా చేస్తుంది. వీటితో పాటు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. మరి చూయింగ్ గమ్ నమలడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ఒకసారి తెలుసుకుందాం రండి.
హృదయ స్పందన రేటు..
నడుస్తున్నప్పుడు చూయింగ్ గమ్ నమలడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. అంతేగాక ఇది శరీరంలోని కేలరీలను బర్న్ చేస్తుందంటున్నారు నిపుణులు. ఫిజికల్ థెరపీ సైన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, నడుస్తున్నప్పుడు గమ్ నమలడం వల్ల శరీరంలో అదనపు క్యాలరీలు ఖర్చవుతాయట. ఫలితంగా బరువు తగ్గిపోయేందుకు ఆస్కారం ఉందట.




ఆకలిని తగ్గిస్తుంది..
చూయింగ్ గమ్ ఆకలిని తగ్గిస్తుంది అలాగే ఆకలి కోరికలను అదుపు చేస్తుంది. దీనిని నమిలిన తర్వాత చాలా సేపటి వరకు ఆకలి వేయదు. ముఖ్యంగా భోజనానికి ముందు, తర్వాత చూయింగ్ గమ్ నమలడం వల్ల స్నాక్స్ లేదా స్వీట్లు తినాలనే కోరికలు తగ్గుతాయట. వాస్తవానికి, ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం కూడా ఇదే సూచించింది. ఒక అధ్యయనం ప్రకారం చూయింగ్ గమ్ నమిలే వారిలో ఇతరుల కంటే ఎక్కువ కేలరీలు (సుమారు 5 శాతం) బర్న్ అవుతాయి. ఫలితంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
అతిగా వద్దు..
చూయింగ్ గమ్ క్యాలరీలను తగ్గించడంలో సహాయపడినప్పటికీ అతిగా తినొద్దంటున్నారు నిపుణులు. ఎక్కువగా చూయింగ్ గమ్ నమలడం వల్ల దుష్ప్రభావాలు, దంత క్షయం, దవడ నొప్పి, అతిసారం, ఉదర సంబంధిత సమస్యలు, చిగుళ్ల వాపుతో పాటు జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారట. సో కాబట్టి మరి అతిగా చూయింగ్ గమ్‌ను నమలద్దు అంటున్నారు నిపుణులు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..