AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health News: నిద్ర పట్టకపోవడానికి కారణమేంటో తెలుసా?.. షాకింగ్ విషయాలు వెల్లడించిన వైద్యులు..!

Health News: ప్రస్తుత ఉరుకులు, పరుగలు జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో కూడిన జీవితాన్ని అనుభిస్తున్నారు. మానసిక, శారీరక ఒత్తిడి కారణంగా చాలా మంది అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు.

Health News: నిద్ర పట్టకపోవడానికి కారణమేంటో తెలుసా?.. షాకింగ్ విషయాలు వెల్లడించిన వైద్యులు..!
Insomnia
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 29, 2022 | 6:20 AM

Health News: ప్రస్తుత ఉరుకులు, పరుగలు జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో కూడిన జీవితాన్ని అనుభిస్తున్నారు. మానసిక, శారీరక ఒత్తిడి కారణంగా చాలా మంది అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. వీటిలో ముఖ్యంగా నిద్రలేమి సమస్య. చాలా మంది ఒత్తిడి కారణంగా నిద్రలేమి సమస్యతో సతమతం అవుతుంటారు. ఈ విషయంలో ఎంతో మంది వైద్యులను కూడా సంప్రదిస్తున్నారు. రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదని, ఏంటో అర్థం కావడం లేదంటూ వైద్యుల వద్ద వాపోతుంటారు. అయితే, నిద్ర లేమికి ఒత్తిడే కారణం అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అసలు కారణం వేరే ఉందని వైద్యులు చెబుతున్నారు. తాజాగా జరిపిన ఒక అధ్యయనం నిద్ర లేమికి ఒత్తిడితో పాటు మరో కారణం కూడా ఉందని తేల్చారు. అవును.. నిద్ర లేమి సమస్యకు ఒత్తిడితో కూడిన జీవిన విధానంతో పాటు.. కాలుష్యం కూడా ఒక కారణం అని అధ్యయనకారులు తేల్చారు. అనేక ఆరోగ్య సమస్యలకు కారణమైనట్లుగానే.. నిద్ర లేమికి కూడా వాయు కాలుష్యం ప్రధాన కారణం అని నిర్ధారించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. వాయు కాలుష్యం కారణంగా గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా వంటి ప్రమాకరమైన వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. తాజాగా వాయు కాలుష్యం కారణంగా నిద్ర లేమి సమస్య కూడా పెరిగిపోతుందని తేల్చారు. నైట్రోజన్ డయాక్సైడ్‌ ఎక్కువగా పీల్చుకోవడం, PM స్థాయి 2.5 ఉండటం నిద్రలేమికి కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు. పరిశోధన ప్రకారం.. వాహనాల ట్రాఫిక్ వల్ల వచ్చే వాయు కాలుష్యాన్ని నైట్రోజన్ డయాక్సైడ్ (NO2) అంటారు. ఇది నిద్రను తగ్గిస్తుంది. ఫలితంగా రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోతారు. అదే సమయంలో ఉదయం త్వరగా మేల్కొంటారు. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్త్ ఇ. బిల్లింగ్స్ ప్రకారం.. వాయు కాలుష్యం గుండె, ఊపిరితిత్తులపై మాత్రమే కాకుండా, నిద్రపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. అలాగే, వాయు కాలుష్యం ముక్కు పైభాగాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. అలా శ్వాసను, నిద్రను నియంత్రించే మెదడుపై తన ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం.. ఆరోగ్య నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం ఇవ్వడం జిరగింది. దీనిని టీవీ9 తెలుగు నిర్ధారించలేదు.

Also read:

PM – MP Marriage: ఎంపీతో పెళ్లికి సిద్ధమైన మాజీ ప్రధాని.. ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Home Loan Tips: హోమ్ లోన్ అప్లికేషన్ ప్రతిసారి రిజెక్ట్ అవుతుందా? ఇలా చేస్తే లోన్ పక్కా..!

Viral Photo: ఈ ఫోటోలో అందమైన అమ్మాయి దోబూచులాడుతోంది.. ఆమె ఎక్కడుందో మీరు కనిపెట్టగలరా?..