Diabetes: మధుమేహం ఉన్నవారు లంచ్‌ సమయంలో ఇలా చేస్తే షుగర్‌ లెవల్స్‌ పెరగవు!

దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు వేగంగా పెరుగుతున్నారు. ఐసీఎంఆర్‌ (ICMR) అధ్యయనం ప్రకారం.. 2019లో 7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ సంఖ్య 10.1 కోట్లకు పెరిగింది. ఐసీఎంఆర్‌ నివేదిక ప్రకారం, దేశ జనాభాలో కనీసం 15.3 శాతం మంది అంటే 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటీస్ విభాగంలో ఉన్నారు. అంటే వారు త్వరలో మధుమేహానికి గురవుతారు...

Diabetes: మధుమేహం ఉన్నవారు లంచ్‌ సమయంలో ఇలా చేస్తే షుగర్‌ లెవల్స్‌ పెరగవు!
Diabetes
Follow us

|

Updated on: Aug 22, 2024 | 6:00 PM

దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు వేగంగా పెరుగుతున్నారు. ఐసీఎంఆర్‌ (ICMR) అధ్యయనం ప్రకారం.. 2019లో 7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ సంఖ్య 10.1 కోట్లకు పెరిగింది. ఐసీఎంఆర్‌ నివేదిక ప్రకారం, దేశ జనాభాలో కనీసం 15.3 శాతం మంది అంటే 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటీస్ విభాగంలో ఉన్నారు. అంటే వారు త్వరలో మధుమేహానికి గురవుతారు. 20 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులను సర్వేలో చేర్చారు. ఈ అధ్యయనం యూకే మెడికల్ జర్నల్ ‘లాసెంట్’లో ప్రచురితమైంది. కొన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఈ సంఖ్య స్థిరంగా ఉండగా, ఇతర రాష్ట్రాల్లో ఇది వేగంగా పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం.

చెడు జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల మధుమేహం వంటి అనేక వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఈ అలవాట్ల వల్ల శరీరం గ్లూకోజ్‌ని సరైన రీతిలో వినియోగించుకోలేకపోతుంది. దీని కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి మళ్లీ మళ్లీ పెరగడం ప్రారంభమవుతుంది. దీనిని హై పోస్ట్‌ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ అంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మధ్యాహ్న భోజనం అత్యంత ముఖ్యమైనది. ఈ సమయంలో పొరపాట్లు చేస్తే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అందువల్ల మీరు రోజంతా ఏమి తింటారు అనేది చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో మధ్యాహ్న భోజనం గురించి చర్చించడం చాలా ముఖ్యం.

మధుమేహ వ్యాధిగ్రస్తులు మధ్యాహ్న భోజన సమయంలో గుర్తించుకునే విషయాలు:

లంచ్ అనేది రోజంతా పూర్తి ఆహారంగా భావిస్తారు. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గులు ఏర్పడతాయి . మీరు ఆలస్యంగా భోజనం చేసినప్పుడు హెచ్చు తగ్గుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం పూట అల్పాహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారంతో మధ్యాహ్న భోజనం ప్రారంభిస్తే మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇది రక్తంలో చక్కెరకు సంబంధించిన అనేక సమస్యలను తగ్గిస్తుంది. మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లయితే, మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిని చెక్‌ చేసుకోవాలి. మధుమేహంతో బాధపడుతున్న రోగులు భోజనం ముగించిన 1 లేదా 2 గంటల తర్వాత షుగర్‌ టెస్ట్‌ చేసుకోవాలి.

మధ్యాహ్న భోజనంతో కడుపు నింపుకోకూడదు

చాలా మంది వ్యక్తులు కేవలం లంచ్ సమయంలో పూర్తిగా సరిపెట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆహారంలో ఉండే పోషకాల పట్ల వారు శ్రద్ధ వహించరు. ఆరోగ్యకరమైన ఆహారం లేకపోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీని కోసం మీరు మీ ఆహారాన్ని సాదాసీదాగా చేసుకోవాలి. మీ ఆహారంలో కార్బోహైడ్రేట్ల నుండి ప్రోటీన్లు, కొవ్వుల వరకు ప్రతిదీ ఉండాలి. మధ్యాహ్న భోజనం ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫాస్ట్ ఫుడ్ తినడం మానేయండి

మారుతున్న నేటి జీవనశైలిలో ఇంటి ఆహారానికి బదులు సూపర్ మార్కెట్ల నుంచి వచ్చే శాండ్ విచ్ లను తినేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్యాన్డ్ ఫుడ్స్ మీ ఆకలిని తీర్చగలవు, కానీ ఆరోగ్యానికి చాలా హానికరం. ఇలాంటి వాటిలో రుచిని పెంచే ఓ రకరమైన ఉప్పును కలుపుతారు. ఇది కానీ ఆరోగ్యానికి హానికరం.

లంచ్ తర్వాత శీతల పానీయాల ట్రెండ్

ఈ రోజుల్లో, చాలా మంది మధ్యాహ్న భోజనంలో కార్బోనేటేడ్, చక్కెర పానీయాలు తీసుకుంటారు. శీతల పానీయాల టీ తాగడం సర్వసాధారణమైపోయింది. ఇలా చేస్తే వెంటనే ఆపేయాలి. దీన్ని తీసుకోవడం ద్వారా ముందుగా మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. రెండవది, ఇందులో పోషకాలు కనిపించవు. ఈ పానీయాలు ఆకలిని తగ్గిస్తాయి. ఇది ఆరోగ్యానికి అత్యంత హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మధుమేహం ఉన్నవారు లంచ్‌ సమయంలో ఇలా చేస్తే షుగర్‌ లెవల్స్‌ పెరగవు!
మధుమేహం ఉన్నవారు లంచ్‌ సమయంలో ఇలా చేస్తే షుగర్‌ లెవల్స్‌ పెరగవు!
చిరంజీవి ఆస్తులు తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే..
చిరంజీవి ఆస్తులు తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే..
ఓరినాయనో.. సిగరెట్ వెలిగించుకోడానికి ఈ కారును ఎలా వాడాడో చూశారా..
ఓరినాయనో.. సిగరెట్ వెలిగించుకోడానికి ఈ కారును ఎలా వాడాడో చూశారా..
ఒకే టెస్ట్ ఇన్నింగ్స్‌లో 700 కంటే ఎక్కువ బంతులు ఆడిన రికార్డ్
ఒకే టెస్ట్ ఇన్నింగ్స్‌లో 700 కంటే ఎక్కువ బంతులు ఆడిన రికార్డ్
గూగుల్ మ్యాప్‌లో వినిపించే ఆ మహిళా గొంతు ఎవరిదో తెలుసా?
గూగుల్ మ్యాప్‌లో వినిపించే ఆ మహిళా గొంతు ఎవరిదో తెలుసా?
సమస్యకు పరిష్కారం యుద్ధభూమి కాదు: ప్రధాని
సమస్యకు పరిష్కారం యుద్ధభూమి కాదు: ప్రధాని
మళ్లీ వానలు వస్తున్నాయ్.. ఆంధ్రా తాజా వెదర్ రిపోర్ట్
మళ్లీ వానలు వస్తున్నాయ్.. ఆంధ్రా తాజా వెదర్ రిపోర్ట్
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేసిన ఓజీ టీమ్
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేసిన ఓజీ టీమ్
గుండెపోటుతో ఎయిర్ పోర్టులో కుప్పకూలిన వ్యక్తి.. కాపాడిన జవాన్లు..
గుండెపోటుతో ఎయిర్ పోర్టులో కుప్పకూలిన వ్యక్తి.. కాపాడిన జవాన్లు..
తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు..!
తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు..!
వాగులో చేపల కోసం వల వేసిన జాలరి.. చివర్లో ఊహించని ట్విస్ట్
వాగులో చేపల కోసం వల వేసిన జాలరి.. చివర్లో ఊహించని ట్విస్ట్
వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే?
వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే?
అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.
అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.
పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.
పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..
డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?
డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?
ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే
ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే