Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: వీటిని గుర్తుపట్టారా? డయాబెటిస్‌ను 7 రోజుల్లో తరిమేసే అద్భుత గింజలివి..

నేటి జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా పుట్టిన పసికందు నుంచి పండు ముసలి వరకు అందరికీ డయాబెటిస్, హార్ట్‌ఎటాక్‌ వంటి ఖరీదైన రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్‌ సైలెంట్‌ కిల్లర్. ఒక్కసారి ఒంట్లోకి వచ్చిందంటే జీవితకాలం తిష్ట వేస్తుంది. అయితే ‘మైల్డ్‌ షుగర్‌’ అనీ, ‘లైట్‌ షుగర్‌’ అనీ తేడాలతో చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అసలు అలాంటివేమీ ఉండవని నిపుణులు అంటున్నారు..

Diabetes: వీటిని గుర్తుపట్టారా? డయాబెటిస్‌ను 7 రోజుల్లో తరిమేసే అద్భుత గింజలివి..
Dates Seeds
Srilakshmi C
|

Updated on: Sep 08, 2024 | 8:16 PM

Share

నేటి జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా పుట్టిన పసికందు నుంచి పండు ముసలి వరకు అందరికీ డయాబెటిస్, హార్ట్‌ఎటాక్‌ వంటి ఖరీదైన రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్‌ సైలెంట్‌ కిల్లర్. ఒక్కసారి ఒంట్లోకి వచ్చిందంటే జీవితకాలం తిష్ట వేస్తుంది. అయితే ‘మైల్డ్‌ షుగర్‌’ అనీ, ‘లైట్‌ షుగర్‌’ అనీ తేడాలతో చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అసలు అలాంటివేమీ ఉండవని నిపుణులు అంటున్నారు. ఎవరైనా సరే, రక్తంలో గ్లూకోజు పరగడుపున 125 దాటినా, తిన్న తర్వాత 2 గంటలకు 200 దాటినా వారికి మధుమేహం వచ్చినట్టేనని గుర్తించాలి. ఒక్కసారి అలా కనబడినా సరే, మందులు మొదలు పెట్టాల్సిందే. దాన్ని ఆహారంతో తగ్గించేస్తామనీ, వ్యాయామ నియమాలతో దారిలోకి తెచ్చేస్తామనీ.. తప్పించుకుని తిరగటానికి వీల్లేదట. అలాగే తప్పనిసరిగా ఆహార అలవాట్లలో కూడా కొన్ని మార్పులు చేర్చుకోవాలి.

వ్యాయామం నుంచి ఆరోగ్యకరమైన ఆహారం వరకు ప్రతిదానిలో కఠినమైన నియంత్రణ అవసరం. దానితో పాటు, కాకరకాయ రసం తాగడం, నేరేడు గింజలు తినడం వంటి అనేక రకాల ఇంటి చిట్కాలు కూడా కొందరు అనుసరిస్తుంటారు. వీటి మాదిరిగానే ఖర్జూర గింజలు కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు బలేగా పనిచేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ విత్తనాలు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే, డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఖర్జూరాలు అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కానీ ఖర్జూరం లోపల ఉండే గింజలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఖర్జూరం విత్తనాలు కొన్ని ముఖ్యమైన పదార్ధాలను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో ఉన్న గ్లూకోజ్‌ను శక్తిగా మార్చడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, ఖర్జూరంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ రుగ్మతల చికిత్సలో కూడా సహాయపడుతుంది. ఈ విత్తనాలు మంచి జీవక్రియను నిర్వహించడానికి కూడా మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి.

అయితే ఖర్జూర గింజలను ఎలా తినాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. ఖర్జూరం తిన్న తర్వాత విత్తనాలను బాగా కడగాలి. ఖర్జూరం గింజలకు అంటకుండా పూర్తిగా కడగాలి. తర్వాత విత్తనాలను కొన్ని రోజులు ఎండలో ఆరబెట్టాలి. ఎండు గింజలను తీసుకుని పాన్‌లో కాసేపు వేపాలి. ఇప్పుడు చల్లబరచడానికి కాసేపు పక్కన పెట్టాలి. చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 1/2 టీస్పూన్ గోరువెచ్చని నీటిలో కలుపుకుని, ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే 7 రోజుల్లోనే మంచి ఫలితాలను చూస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.