ఈ వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో దీని లక్షణాలు బయటపడతాయి. శరీరంపై పొక్కులు, జ్వరం, గొంతు ఎండిపోవడం, తల, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. ఇలా దాదాపు 2 నుంచి 4 వారాలపాటు కొనసాగుతుంది. వ్యక్తి రోగ నిరోధక శక్తిపై కూడా ఇది దాడి చేస్తుంది.