- Telugu News Photo Gallery Travel Tips: Precautions to take when you are travelling with your children
Travel Tips: మీ పాపాయితో కలిసి టూర్‌కి వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి
పిల్లలకు జన్మనిస్తే సరిపోదు. వారిని మంచి మనిషిగా మార్చడానికి, ఆరోగ్యంగా పెంచడానికి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడాలి. ముఖ్యంగా పిల్లలు పుట్టాక వారి కోసం రాత్రిళ్లు నిద్ర త్యాగం చేయాలి. పుట్టిన బిడ్డను చూసుకోవడం దగ్గర్నుంచి వారి భవిష్యత్తు గురించి ఆలోచించడం వరకు జీవితమంతా ఈ ప్రక్రియ సాగుతుంది. అయితే వీటన్నింటి కంటే ముందుగా..
Updated on: Sep 08, 2024 | 8:30 PM

పిల్లలకు జన్మనిస్తే సరిపోదు. వారిని మంచి మనిషిగా మార్చడానికి, ఆరోగ్యంగా పెంచడానికి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడాలి. ముఖ్యంగా పిల్లలు పుట్టాక వారి కోసం రాత్రిళ్లు నిద్ర త్యాగం చేయాలి. పుట్టిన బిడ్డను చూసుకోవడం దగ్గర్నుంచి వారి భవిష్యత్తు గురించి ఆలోచించడం వరకు జీవితమంతా ఈ ప్రక్రియ సాగుతుంది. అయితే వీటన్నింటి కంటే ముందుగా మిమ్మల్ని మీరు బాగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం.

పిల్లలతో టూర్ వెళ్లేటప్పుడు ప్రయాణంలో ముఖ్యంగా రాత్రిపూట వారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే కష్టం. ముఖ్యంగా పుట్టిన బిడ్డ అయితే ఆ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఏమిటంటే.. మీరు ఎక్కడికి వెళ్లాలో ముందుగా నిర్ణయించుకోవాలి. వీలైనంత వరకు రద్దీగా ఉండే ప్రాంతాలను నివారించడం మంచిది. చిన్న పిల్లలతో కలిసి ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే, సమీపంలో ఆసుపత్రి ఉండే ప్రాంతాన్ని ఎంచుకోవాలి. పిల్లలను ఎత్తైన ప్రదేశాలకు అంటే కొండ ప్రాంతాలకు తీసుకెళ్లకూడదు.

ఆరు నెలల శిశువుకు తల్లిపాలు ఇస్తే సరిపోతుంది. వీరికి బయట ఆహారం అవసరం లేదు. కానీ 1-2 ఏళ్ల పిల్లలు ఇంటి ఆహారాన్ని తినడం అలవాటు చేయాలి. కాబట్టి వారికి తగిన ఆహార ఏర్పాట్లు ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి. అలాగే నీటిని మరిగించి తాగిపించాలి. బయట నీళ్లను అస్సలు తాగించవద్దు.

విమానంలో, కారులో ప్రయాణించే సమయాల్లో చిన్న పిల్లలతో ప్రయాణించడం వల్ల పిల్లలు శబ్ధాలకు భయపడతారు. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో చెవిలో కాటన్ పెట్టాలి. కారు ప్రయాణం సాధారణంగా చాలా చిన్న పిల్లలలో 'మోషన్ సిక్‌నెస్'ని కలిగించదు. అయితే పిల్లలు కొంచెం పెద్దవారైతే ఇలాంటి సమస్య వస్తే అవసరమైన మందులు ఇవ్వాలి.

టూర్‌కి వెళ్లేముందు వైద్యులను కలిసి అవసరమైన మందులను తీసుకోవాలి. వెళ్లే ముందు పీడియాట్రీషియన్‌ను సంప్రదించడం మర్చిపోకూడదు. ఓఆర్‌ఎస్, శుద్ధి చేసిన తాగునీరు తమ వెంట తీసుకెళ్లాలి. అంతేకాకుండా జ్వరం, జలుబు, కడుపునొప్పి, వాంతులు వచ్చినప్పుడు వేసుకోవడానికి అవసరమైన మందులు తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.




