AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. సైలెంట్ కిల్లర్.. బీపీ అకస్మాత్తుగా పెరిగితే ఎందుకు ప్రాణాంతకంగా మారుతుంది..?

రక్తపోటు అకస్మాత్తుగా పెరగడం అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి.. చెడు జీవనశైలి, కొన్ని వ్యాధుల కారణంగా బిపి అకస్మాత్తుగా పెరగవచ్చు. రక్తపోటు అకస్మాత్తుగా పెరిగితే వెంటనే కొన్ని చర్యలు తీసుకోవాలి. మందులు తీసుకున్న తర్వాత కూడా ఎటువంటి ప్రయోజనం లేకపోతే వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లండి. రక్తపోటు అకస్మాత్తుగా పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? నిపుణులు ఏం చెబుతున్నారు ఈ విషయాలను తెలుసుకోండి..

వామ్మో.. సైలెంట్ కిల్లర్.. బీపీ అకస్మాత్తుగా పెరిగితే ఎందుకు ప్రాణాంతకంగా మారుతుంది..?
High Blood Pressure
Shaik Madar Saheb
|

Updated on: May 14, 2025 | 4:42 PM

Share

రక్తపోటు ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండాలి.. బ్లడ్ ప్రెజర్ (బీపీ) పెరుగుదల లేదా తగ్గుదల కారణంగా అనేక రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంది.. ఇది వైద్య అత్యవసర పరిస్థితిగా కూడా మారుతుంది. రక్తపోటు అకస్మాత్తుగా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆల్కహాల్, కొలెస్ట్రాల్, కొన్ని రకాల మందులు, కొన్ని తీవ్రమైన వ్యాధులు కూడా బిపి అకస్మాత్తుగా పెరగడానికి కారణం కావచ్చు. మీ రక్తపోటు అకస్మాత్తుగా పెరిగితే అది మీకు చాలా ప్రమాదకరమని.. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. రక్తపోటు ఎంత వరకు ఉండాలి.. బిపి అకస్మాత్తుగా ఎందుకు పెరుగుతుంది..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ వివరాలను తెలుసుకోండి..

మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించకపోతే మీ బిపి కూడా అకస్మాత్తుగా పెరుగుతుంది. కొన్నిసార్లు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించే వ్యక్తులలో కూడా ఇది జరుగుతుంది. రక్తపోటు అకస్మాత్తుగా పెరగడం అనేది మీ శరీరంలో ఏదో తీవ్రమైన వ్యాధి అభివృద్ధి చెందుతోందనడానికి సంకేతం.. లేదా మీరు ఏదో విషయం గురించి చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అర్ధం.. రక్తపోటు అకస్మాత్తుగా పెరిగితే గుండెకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇది కూడా గుండెపోటు లక్షణం కావచ్చు. బిపి అకస్మాత్తుగా పెరిగితే, వెంటనే దానిని నియంత్రించడానికి ప్రయత్నాలు చేయాలి.

బిపి అకస్మాత్తుగా ఎందుకు పెరుగుతుంది?

సాధారణంగా మన బీపీ (రక్తపోటు) 120/80 ఉండాలి. అది 140/90 కన్నా ఎక్కువ ఉంటే ఇబ్బందికరంగా మారవచ్చు.. రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంటే దానికి అనేక కారణాలు ఉండవచ్చు. మొదటి కారణం ఒత్తిడి. అంతేకాకుండా.. కొలెస్ట్రాల్, చెడు జీవనశైలి కూడా దీనికి కారణాలు. అధిక మద్యం సేవించడం, ధూమపానం, అధిక ఉప్పు తీసుకోవడం వల్ల కూడా బిపి అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల కూడా జరుగుతుంది. కిడ్నీ వ్యాధి, థైరాయిడ్, స్లీప్ అప్నియా వంటి వ్యాధుల వల్ల కూడా బిపి అకస్మాత్తుగా పెరుగుతుంది. గర్భధారణ సమయంలో బిపి కూడా అకస్మాత్తుగా పెరుగుతుంది. దీనితో పాటు, అనేక మందులు తీసుకోవడం వల్ల కూడా బిపి పెరుగుతుంది.

పరిష్కారం కోసం ఇలా చేయండి

అకస్మాత్తుగా రక్తపోటు పెరగడం ప్రాణాంతకం. మీకు అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, తల – దవడలో నొప్పి అనిపిస్తే, వెంటనే మీ రక్తపోటును తనిఖీ చేసి, దానిని నియంత్రించడానికి ప్రయత్నించండి.

రక్తపోటు అకస్మాత్తుగా పెరగడం అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి, కాబట్టి వెంటనే వైద్యుడిని సందర్శించడానికి ప్రయత్నించండి.

దీనితో పాటు, గోరువెచ్చని నీరు త్రాగాలి. వేడి నీరు బిపిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒత్తిడి తీసుకోవడం మానేసి, విశ్రాంతి తీసుకోండి.

వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించి చికత్స పొందండి.. అశ్రద్ధ చేయకండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..