షాపింగ్ కార్టులలో ప్రమాదకర బ్యాక్టీరియా.. పిల్లలను కూర్చోనివ్వొద్దు!
షాపింగ్ మార్ట్‌లకు వెళ్లినప్పుడు మనం తీసుకున్న ఉత్పత్తులను నిల్వ చేయడానికి షాపింగ్ కార్ట్‌లను ఉపయోగిస్తుంటాం. ఇక చిన్న పిల్లలు ఉన్నవారు వారిని షాపింగ్ కార్టులో ఉన్న సీటులో కూర్చోబెడతారు. దీంతో వారు హాయిగా కూర్చుంటారు. తల్లిదండ్రులు ఇబ్బంది లేకుండా షాపింగ్ చేసుకుంటారు. అయితే, ఇక్కడే ఓ ప్రమాదం పొంచివుంది. షాపింగ్ కార్టులలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉందని ఇటీవల వైద్యులు గుర్తించారు.

చాలా మంది షాపింగ్ మార్ట్‌లకు వెళ్లినప్పుడు మనం తీసుకున్న ఉత్పత్తులను నిల్వ చేయడానికి షాపింగ్ కార్ట్‌లను ఉపయోగిస్తుంటాం. ఇక చిన్న పిల్లలు ఉన్నవారు వారిని షాపింగ్ కార్టులో ఉన్న సీటులో కూర్చోబెడతారు. దీంతో వారు హాయిగా కూర్చుంటారు. తల్లిదండ్రులు ఇబ్బంది లేకుండా షాపింగ్ చేసుకుంటారు. అయితే, ఇక్కడే ఓ ప్రమాదం పొంచివుంది. షాపింగ్ కార్టులలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉందని ఇటీవల వైద్యులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఓ వైద్యుడు వెల్లడించారు.
అరిజోనా విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ డాక్టర్ కునాల్ సూద్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు. అమెరికాలోని వివిధ నగరాల నుంచి 85 సాపింగ్ కార్టులను పరీక్షించగా.. వాటిలో ప్రమాదకరమైన స్థాయిలో బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. అరిజోనా విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి.
ఎంత ప్రమాదకరమో తెలుసా?
షాపింగ్ కార్ట్ హ్యాండిల్స్‌లో పబ్లిక్ రెస్ట్‌రూంలు, ఇతర మురికితోకూడిన బహిరంగ ప్రదేశాల కంటే కూడా బ్యాక్టీరియా ఉందని గుర్తించారు. మల కాలుష్యం నుంచి వచ్చే ఇ.కొలి బ్యాక్టీరియా షాపింగ్ కార్ట్ హ్యాండిల్స్‌లో ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల మాత్రమే భావించే కోలిఫాం బ్యాక్టీరియా పిల్లల్లో విరేచనాలు, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయని వెల్లడించారు.
ఎలా వ్యాప్తిస్తుంది?
షాపింగ్ మాల్స్‌లోని షాపింగ్ కార్ట్‌లను తరచుగా బయట ఉంచుతారు. వాటిని ఎండ, వర్షం, పార్కింగ్ స్థలాల్లో వదిలేసినప్పుడు.. వాటి ఉపరితలాలపై బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది. సూపర్ మార్కెట్లలో కార్టులను ఉపయోగించిన చేతులతో తమ ముఖాలను తాకినప్పుడు లేదా అవే చేతులతో పిల్లలకు తినిపించినప్పుడు ఈ క్రిములు నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
నివారణ ఏంటి?
షాపింగ్ కార్ట్ హ్యాండిల్‌ను తాకే ముందు, పిల్లలను దానిపై కూర్చోబెట్టే ముందు క్రిమిసంహారక వైప్‌లతో వాటిని శుభ్రం చేయాలి. షాపింగ్ చేసిన వెంటనే మీ హ్యాండ్ శానిటైజర్‌తో మీ చేతులను శుభ్రం చేసుకోవాలి. పిల్లలను కార్ట్ స్ట్రాలర్‌లోకి ఎక్కించేటప్పుడు, వారు వాటిపై నోరు పెట్టకుండా లేదా హ్యాండిల్స్‌ను తాకకుండా చూసుకోవాలి.
View this post on Instagram
షాపింగ్ కార్టులు మన సౌకర్యం కోసం తయారు చేయబడినప్పటికీ.. మన నిర్లక్ష్యం వల్ల అవి ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అందుకే ఈసారి సూపర్ మార్కెట్లకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శానిటైజర్ లేదా క్రిమిసంహారక వైప్‌లను ఉపయోగించి ప్రమాదాన్ని తగ్గించుకోండి.
