AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: రోజూ ఓ కప్పు కాఫీ తాగితే.. అమేజింగ్ అంతే.! ఆ సమస్యకు అమృతం లాంటిది..

మంచి నిద్ర, సరిగ్గా ఆకలి వేయకపోవడం లాంటి లక్షణాలు ఉంటే.. మన శరీరంలో మెగ్నీషియం లోపం అయి ఉండవచ్చునని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. దీనికోసం సరైన సమయానికి.. మంచి పౌష్టికాహారం తీసుకుంటే బెటర్ అనేది నిపుణుల మాట. మరి మెగ్నీషియం శరీరంలో..

Health Tips: రోజూ ఓ కప్పు కాఫీ తాగితే.. అమేజింగ్ అంతే.! ఆ సమస్యకు అమృతం లాంటిది..
Tea Vs Coffee
Yellender Reddy Ramasagram
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 03, 2024 | 9:09 PM

Share

మంచి నిద్ర, సరిగ్గా ఆకలి వేయకపోవడం లాంటి లక్షణాలు ఉంటే.. మన శరీరంలో మెగ్నీషియం లోపం అయి ఉండవచ్చునని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. దీనికోసం సరైన సమయానికి.. మంచి పౌష్టికాహారం తీసుకుంటే బెటర్ అనేది నిపుణుల మాట. మరి మెగ్నీషియం శరీరంలో పెరగడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే మెగ్నీషియం శరీరంలో ఎక్కువగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్ నుంచి మనకు శక్తి వచ్చేలా చేయడంలో మెగ్నీషియం ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఇది మంచి శక్తితో పాటు, చక్కటి నిద్రపట్టేలా చేస్తుంది. రక్తంలో షుగర్‌ను, హార్మోన్లను క్రమబద్ధీకరిస్తుంది. మెగ్నీషియం తగినంత లేకపోతే ఆనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. మనిషి శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే ఆకలి వేయదు. వికారంగా ఉండటం, వాంతులు రావడం జరుగుతుంది. నీరసంగా కూడా ఉంటారు. హార్ట్ బీట్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. కళ్లు మసకబారటం, కండరాల నొప్పితో పాటు.. ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర సరిగ్గా పట్టదు, హైబీపీ వస్తుంది. ఆస్తమా రోగులకు మెగ్నీషియం లోపిస్తే ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది.

మెగ్నీషియం బాడీలో పెరగాలంటే ఆకుకూరలు, అవకాడో, అరటి పండు, రాస్ బెర్రీస్, ఫిగ్స్ వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలని న్యూట్రీషియనిస్టులు అంటున్నారు. వీటితో పాటు బ్రోకలీ, క్యాబేజీ, పచ్చి బఠానీలు, మొలకలు వంటి వాటిలో కూడా మెగ్నీషియం బాగా దొరుకుతుందన్నారు. బ్రౌన్ రైస్, ఓట్స్, సీ ఫుడ్స్‌లో మెగ్నీషియం లభిస్తుంది. మెగ్నీషియం వెంటనే బాడీలో ఉత్పత్తి కావాలంటే ఒక కప్పు కాఫీ తాగడమో లేదా డార్క్ చాక్లెట్ తిన్నా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మెగ్నీషియం లోపానికి వెంటనే జాగ్రత్తలు తీసుకోకుంటే అనారోగ్యానికి గురవుతారని వైద్యులు అంటున్నారు. సబ్జా గింజలు, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా-3 కొవ్వు, ఆమ్లాలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మెగ్నీషియం శరీరంలో తగ్గదని నిపుణులు చెప్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి