Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits of Rosewater: మడమల నుంచి గొంతు నొప్పి వరకు రోజ్ వాటర్‌తో చెక్ పెట్టండి..

రోజ్ ప్రేమకు గుర్తు.. సింబాలిక్ మాత్రమే కాదు అది చేసే లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి..అది చేసే ప్రయోజనాల గురించి కూడా తెలుసకుందాం..

Benefits of Rosewater: మడమల నుంచి గొంతు నొప్పి వరకు రోజ్ వాటర్‌తో చెక్ పెట్టండి..
Rose Water
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 21, 2022 | 11:02 AM

రోజ్ ఫ్లవర్ ప్రేమకు గుర్తు.. ఇది సింబాలిక్ మాత్రమే కాదు. గులాబీ పువ్వుతో మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. గులాబీ పువ్వు తన సువాసనతో ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్దులను చేస్తుంది. అందుకే పువ్వులలో రాణిగా గులాబీ అంటూ అభివర్ణిస్తారు. గులాబీ పువ్వుల నుంచి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో ఉపయోగిస్తారు. ఇది కొత్తగా వచ్చిందేం కాదు.. కొన్ని శతాబ్దాలుగా భారత దేశంలో ఉపయోగిస్తున్నారు. గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్ను ఆసియా దేశాల వంటలలో విరివిగా వాడుతున్నారు.

చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. గులాబీ పువ్వుతో తయారుచేసిన రోజ్ వాటర్ అనేక గుణాలతో నిండి ఉంటుంది. మహిళలు తమ బ్యూటీ కిట్‌లో రోజ్ వాటర్‌ను ఖచ్చితంగా ఉంచుకుంటారు. వింటర్ సీజన్‌లో తరచుగా ముఖాన్ని రోజ్ వాటర్‌తో శుభ్రం చేసుకుంటారు. విశేషమేమిటంటే రోజ్ వాటర్ సమ్మర్ ఫేస్ ప్యాక్‌లో మాత్రమే కాకుండా.. చలికాలంలో అనేక ప్రత్యేక రూపాల్లోనూ ఉపయోగించబడుతుంది. అనేక చర్మ సంబంధిత సమస్యలకు రోజ్ వాటర్ ఒక పరిష్కారం. అయితే చేసే ఆరోగ్య మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రోజ్ వాటర్ అంటే ఏమిటి

గులాబీ రేకులను ఆవిరి చేయడం ద్వారా దాని సువాసనతో కూడిన రోజ్ వాటర్ తయారు చేస్తారు. రోజ్ వాటర్‌లో రసాయనాలు ఉపయోగించరు. మీరు మార్కెట్ నుండి రోజ్ వాటర్ తీసుకోకూడదనుకుంటే.. ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు.

రోజ్ వాటర్ అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకోండి

చర్మానికి మేలు చేస్తుంది

మీరు మీ చర్మాన్ని అందంగా ఉంచుకోవాలనుకుంటే.. రోజ్ వాటర్‌ని మీ దినచర్యలో చేర్చుకోండి. రోజ్ వాటర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని లోపల, వెలుపల సురక్షితంగా ఉంచుతుంది.  తాజాదనాన్ని అందిస్తుంది. దీని వాడకం వల్ల అనేక చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇది మాత్రమే కాదు.. ఇది తామర లేదా రోసేసియా చికాకును ఉపశమనానికి అందిస్తుంది.

రోజ్ వాటర్ కూడా గొంతు నొప్పి నుండి ఉపశమనం

మీ వద్ద స్వచ్ఛమైన రోజ్ వాటర్ ఉంటే.. అది మీ గొంతు నొప్పిని కూడా తొలగించగలదు. గొంతు నొప్పికి రోజ్ వాటర్ ఒక సహజ నివారణ అని చెప్పవచ్చు.

చీలమండలు, పగుళ్లకు..

చలికాలంలో తరచుగా పగిలిన మడమలు ఇబ్బంది కలిగిస్తాయి. ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న మహిళలు రోజ్ వాటర్ ను ఉపయోగించాలి. మీరు రోజ్ వాటర్‌లో గ్లిజరిన్ మిక్స్ చేసి, పగిలిన మడమలపై అప్లై చేయడి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లో మీకు ఆ సమస్య తీరిపోతుంది.

కాలిపోయిన గాయాలపై..

కొన్ని నివేదికల ప్రకారం.. రోజ్ వాటర్ కూడా క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాలిన గాయాలను వేగంగా నయం చేయడంలో ఇది చాలా సహాయకారిగా ఉంటుంది. దీని ఉపయోగం ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందదు.

రోజ్ వాటర్ డార్క్ సర్కిల్స్ ను తొలగిస్తుంది

తరచుగా నిద్ర లేకపోవటం వల్ల లేదా టెన్షన్ తదితర కారణాల వల్ల మన కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. మీరు ఈ మరకలను తొలగించాలనుకుంటే రోజ్ వాటర్ ఈ సమస్యను వదిలించుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఇందుకోసం రోజ్ వాటర్ ను కాటన్ బాల్ లో తీసుకుని డార్క్ సర్కిల్ పై అప్లై చేయాలి.

ఇవి కూడా చదవండి: TTD: తిరుచానూరులో శ్రీయాగానికి అంకురార్పణ.. ఈ ఏడు రోజులపాటు ఆర్జిత సేవ‌లు ర‌ద్దు..

Covid Claims: లెక్కలు తప్పుతున్నాయి.. కోవిడ్‌ మరణాలపై పరిశోధకుల అనుమానాలు..