పాద నమస్కారం చేస్తున్నారా !! ఇది గుర్తుంచుకోండి !! వీడియో

సనాతన సంప్రదాయంలో పెద్దల పాదాలను తాకి ఆశీస్సులు పొందడం అనేది ఒక భాగం. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది.

Phani CH

|

Jan 21, 2022 | 9:57 AM

సనాతన సంప్రదాయంలో పెద్దల పాదాలను తాకి ఆశీస్సులు పొందడం అనేది ఒక భాగం. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. తల్లితండ్రులు, గురువులు, పెద్దవారి పాదాలను తాకి వారి ఆశీస్సులు పొందడం అనాదీగా వస్తోంది. హిందుత్వంలో పెద్దల పాదాలను తాకి ఆశీర్వచనాలు తీసుకోవాలని కోరిక అందరిలోనూ ఉంటుంది. అయితే ఎవరి పాదాలను తాకాలి?, అందుకు నియమాలు ఏంటి? వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. సనాతన కాలం నుంచి కొనసాగుతున్న పాద స్పర్శ సంప్రదాయం సామాన్యుడికే కాదు దేవతలతోనూ ముడిపడి ఉంది. పాదాలను తాకడమే కాకుండా పాదాలు కడుగుతూ తమ బంధువుల పట్ల, పెద్దల పట్ల భక్తిని చాటుకోవడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu