Fish: చేపలు ఎక్కువగా తింటున్నారా !! అయితే ఇది మీకోసమే.. వీడియో

Phani CH

|

Updated on: Jan 21, 2022 | 9:48 AM

ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో చేపలు తినడం వల్ల ఎన్నో అరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. వారంలో కనీసం రెండు, మూడు సార్లు చేపలు తినడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చేపలు తినడంద్వారా మతిమరుపు సమస్యకు చెక్‌పెట్టొచ్చంటున్నారు నిపుణులు. గతంలో వయసు మీద పడుతున్నవారికి మాత్రమే మతిమరుపు సమస్య ఉండేది. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో మధ్య వయసు నుంచే మతిమరుపు సమస్య వెంటాడుతోంది.