AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covaxin: హెల్త్ వర్కర్లలో 50 శాతం సమర్థతతో పని చేసిన కోవాగ్జిన్.. వెల్లడించిన అధ్యయనం..

28 రోజుల వ్యవధిలో రెండు డోస్‌ల కోవాగ్జిన్‎ను అందించడం వల్ల హెల్త్ వర్కర్లలో కాకోవిడ్-19పై 50 శాతం ప్రభావం చూపించిందని లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనం తెలిపింది. కోవాగ్జిన్‎ జనవరిలో 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు ఇవ్వడం కోసం అత్యవసర ఆమోదం పొందింది...

Covaxin: హెల్త్ వర్కర్లలో 50 శాతం సమర్థతతో పని చేసిన కోవాగ్జిన్.. వెల్లడించిన అధ్యయనం..
Vaccine
Srinivas Chekkilla
|

Updated on: Nov 24, 2021 | 1:35 PM

Share

28 రోజుల వ్యవధిలో రెండు డోస్‌ల కోవాగ్జిన్‎ను అందించడం వల్ల హెల్త్ వర్కర్లలో కాకోవిడ్-19పై 50 శాతం ప్రభావం చూపించిందని లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనం తెలిపింది. కోవాగ్జిన్‎ జనవరిలో 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు ఇవ్వడం కోసం అత్యవసర ఆమోదం పొందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ నెల ప్రారంభంలో కోవాగ్జి్న్‎ అత్యవసర వినియోగాని ఆమోదం తెలిపింది.

వేగవంతమైన వ్యాక్సిన్ రోల్ అవుట్ ప్రోగ్రామ్‌లు మహమ్మారి నియంత్రణకు అత్యంత ఆశాజనకంగా ఉన్నాయని న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లోని పరిశోధకులు మరియు మెడిసిన్ అదనపు ప్రొఫెసర్ ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యయనంలో 2,714 మందిలో, 1,617 మంది SARS-CoV-2 ఇన్ఫెక్షన్‌కు పాజిటివ్ పరీక్షలు చేయగా 1,097 మందికి వైరస్ సేకినట్లు నిర్ధారించారు. కోవాగ్జి్న్‎ రెండు డోసుల తర్వాత కోవిడ్ నిరోధక శక్తి పెరిగిందన్నారు. RT-PCR పరీక్ష చేయించుకోవడానికి 14 లేదా అంతకంటే ఎక్కువ రోజుల ముందు రెండో డోసు వేయించుకున్న 50 శాతం మందిలో నిరోధక శక్తి పెరిగినట్లు పేర్కొన్నారు.

కోవిడ్ నుంచి రక్షణ పొందేందుకు రెండు డోసులు అవసరమని చెప్పారు. టీకా యొక్క వాస్తవ-ప్రపంచ ప్రభావం తరచుగా నియంత్రిత ట్రయల్ పరిస్థితుల నుండి భిన్నంగా ఉంటుందని పరిశోధకులు వివరించారు. ఇందుకోసమే సమర్థతను అంచనా వేయడం అనేది ఏదైనా వ్యాక్సిన్ రోల్ అవుట్ ప్లాన్‌లో ముఖ్యమైన అంశం. మూడో దశ ట్రయల్స్ సమయంలో సమర్థత 77.8 శాతంగా లెక్కించారు. ఈ అధ్యయనంలో తక్కువ టీకా ప్రభావానికి అనేక అంశాలు కారణమవుతాయని పరిశోధకులు తెలిపారు. “ఢిల్లీలో కోవిడ్-19 టెస్ట్ పాజిటివిటీ రేటు దాదాపు 35 శాతం ఉన్నప్పుడు మా అధ్యయనం జరిగింది – ఇది మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి అత్యధికం. ఏదైనా వ్యాక్సిన్ ప్రభావాన్ని వివరించేటప్పుడు ఇది పరిగణించవలసిన ముఖ్యమైన అంశం, ”అని AIIMS న్యూఢిల్లీలోని మెడిసిన్ హెడ్ నవీత్ విగ్ ఒక ప్రకటనలో తెలిపారు. “సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ లభ్యత, మంచి వేగం టీకా కార్యక్రమానికి మూలస్తంభం” అని విగ్ చెప్పారు.

Read Also… SAP India: డిజిటలైజేషన్ డ్రైవ్‌లో సాప్ ఇండియా కీలకం కానుంది.. కుల్మీత్ బావా సంచలన విషయాలు