Coronavirus Fact Check: ఉల్లిపాయ, కల్లు ఉప్పు తింటే కరోనా 15 నిమిషాల్లో ఖతం అవుతుందా..? సోషల్ మీడియాలో వైరల్..
Covid-19 Fact Check: దేశంలో కరోనా సెకండ్ వేవ్ అలజడి సృష్టిస్తోంది. నిన్న అత్యధిక సంఖ్యలో రికార్డు స్థాయిలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదు కగా.. రెండువేలకు
Covid-19 Fact Check: దేశంలో కరోనా సెకండ్ వేవ్ అలజడి సృష్టిస్తోంది. నిన్న అత్యధిక సంఖ్యలో రికార్డు స్థాయిలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదు కగా.. రెండువేలకు పైగా మరణాలు సంభవించాయి. కరోనా కేసులు ప్రారంభమైన నాటినుంచి ఇంత పెద్ద మొత్తంలో కేసులు, మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో వైరస్‌ను నియంత్రించేందుకు కొన్ని రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలను అమలుచేస్తున్నారు. కొన్ని చోట్ల లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ లాంటివి అమలుచేస్తున్నారు. అయితే.. విటన్నింటి మధ్య తప్పుడు ప్రచారాలు.. ఉచిత సలహాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఏవేవో ఆహార పదార్థాలు తీసుకుంటే… కరోనా తగ్గుతుందంటూ ప్రచారం నడుస్తోంది. పచ్చి ఉల్లిపాయను కల్లు ఉప్పు ద్వారా తింటే.. కోవిడ్ మహమ్మారి కేవలం 15 నిమిషాల్లో నయమవుతుందనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
అయితే ఇలాంటి వైరల్ వార్తలు.. చాలామందిని ప్రభావితం చేస్తుంటాయి. కొంతమంది అసలు ఆలోచించకుండానే.. ఇలాంటివి పాటిస్తూ అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే కల్లు ఉప్పు, పచ్చి ఉల్లిపాయ తినడం ద్వారా కోవిడ్ మహమ్మారి అంతం కాదని నిపుణుల దర్యాప్తులో తేలింది. ఇదంతా పుకార్లేనని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వర్ల్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించాయి. దీంతోపాటు కల్లు ఉప్పు, ఉల్లిపాయ తింటే కరోనా తగ్గిపోతుందన్న వార్తను ఢిల్లీలోని డాక్టర్లు కూడా ఖండించారు. ఇవి పాటించవద్దంటూ ప్రజలకు సూచించారు.
ఇదిలాఉంటే.. యూఎస్ నేషనల్ ఆనియన్ అసోసియేషన్ ప్రకారం.. ఉల్లిపాయ ముక్క విష జెర్మ్స్‌ను అరికట్టగలదని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు కనుగొనలేదు. సుమారు 1500 సంవత్సరాల క్రితం.. పచ్చి ఉల్లిపాయ ముక్క బుబోనిక్ ప్లేగు వ్యాధిని నివారించగలదని విశ్వసించేవారని పేర్కొంది.
కావున ప్రాణాంతక వైరస్ నుంచి రక్షించుకునే ఏకైక మార్గం ఏమిటంటే.. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ వాడటం, సమావేశాలు, సభలకు దూరంగా ఉండటం. కావున ఇలాంటివి నమ్మొద్దు.
Also Read: