Coronavirus: గాలిలో 2 గంటల పాటు కరోనా వైరస్‌..సీసీఎంబీ, ఐఎంటెక్‌ సంయుక్త అధ్యయనంలో వెల్లడి

Coronavirus: ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతున్న కరోనా మహమ్మారి గురించి రోజురోజుకు ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని....

Coronavirus: గాలిలో 2 గంటల పాటు కరోనా వైరస్‌..సీసీఎంబీ, ఐఎంటెక్‌ సంయుక్త అధ్యయనంలో వెల్లడి
Follow us
Subhash Goud

|

Updated on: Jan 07, 2021 | 5:29 AM

Coronavirus: ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతున్న కరోనా మహమ్మారి గురించి రోజురోజుకు ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా పూర్తి స్థాయిలో కట్టడిలోకి రాలేకపోతోంది. అంతేకాకుండా వైరస్‌ తన రూపాంతరం మార్చుకుంటూ వ్యాప్తి చెందుతోంది. కరోనా వైరస్‌ గురించి నిపుణులు ఇప్పటికే ఎన్నో విషయాలు వెల్లడించగా, తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజి (సీసీఎంబీ) వెల్లడించింది. వైరస్‌ లోడ్‌ ఎక్కువగా ఉన్న కరోనా రోగులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా సుమారు 2 మీటర్ల దూరం వరకు ప్రయాణిస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. వైరస్‌ గాలిలో 2 గంటల వరకు యాక్టివ్‌గానే ఉంటున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

వ్యక్తుల్లో ఇన్ఫెక్షన్ లక్షణాలు తక్కువగా ఉన్నప్పుడు ఫ్యాన్లు, ఏసీల ద్వారా గాలి విస్తరించని పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తి పరిమితంగా ఉందని సీసీఎంబీ, చండీగఢ్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైక్రోబయాలల్‌ టెక్నాలజీ (ఐఎంటెక్‌)ల సంయుక్త అధ్యయనంలో తేలిందన్నారు.

కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందా..? లేదా? అనే అంశంపై ఉమ్మడిగా అధ్యయనం చేసినట్లు సీసీఎంబీ తెలిపింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని 3 ఆస్పత్రులు, చండీగఢ్‌లోని 3 ఆస్పత్రుల్లోని కోవిడ్‌ వార్డుల్లో గాలి నమూనాలపై అధ్యయనం చేశామని, వాటిలో గాలిలో కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని సీసీఎంబీ స్పష్టం చేసింది.

ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించడం వల్ల కరోనా నుంచి రక్షణ పొందవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా లక్షణాలు అధికంగా ఉన్న వ్యక్తులను కుటుంబ సభ్యులు దూరంగా ఉంచడం వల్ల కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్ రాకేష్‌ మిశ్రా తెలిపారు.

UK Virus 41 Countries: మానవాళిపై వైరస్ లు పగబట్టాయా.. శక్తివంతమైన కొత్తవైరస్ వేగంగా వ్యాపిస్తున్నాయంటూ..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!