Health News: కీళ్ళ సమస్యలతో బాధపడుతున్నారా ? ఈ చిరుధాన్యాలు తింటే ఏంతో మేలు చేస్తాయట..
ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నారు. కరోనా పుణ్యమా అని రోగ నిరోధక శక్తిని పెంపోందించుకునేందుకు మళ్లీ
ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నారు. కరోనా పుణ్యమా అని రోగ నిరోధక శక్తిని పెంపోందించుకునేందుకు మళ్లీ మునుపటి ఆహరపు అలవాట్లను అలవర్చుకుంటున్నారు. అంతేకాకుండా బరువు పెరగడం, తగ్గడం వంటి సమస్యలకు, అలాగే శరీరంలో గ్లూకోజు లెవల్ అదుపులో ఉంచుకోవాలన్న చాలా మంది చిరుధాన్యాలను తినడానికి మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా రాగులు, సజ్జలు వంటివి తినడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో ఉండే ప్రొటీన్లు, పీచు, విటమిన్లు, ఖనిజాల వంటి పోషకాల పదార్థాలు ఉండడం వలన శరీరానికి బలాన్నిస్తాయి. అంతేకాకుండా ఇందులో మేలురకం పిండి పదార్థాలు ఉండడటం వలన జీర్ణక్రియ నియంత్రణకు తోడ్పతతాయి. రోజూ ఇవి తినడం వలన బరువు అదుపులో ఉండడమే కాకుండా.. ఎముకలు బలంగా ఉండడానికి ఎంత సహకరిస్తాయి. కీళ్ళ సమస్యలు తగ్గటానికి కూడా ఇవి ఉపయోగపడతాయట. కీళ్ళ సమస్యలతో బాధపడేవారు వీటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాకుండా చిరుధాన్యాలను ఆహరంలో తీసుకోవడం వలన వాపు తగ్గిండంతోపాటు, ఎముకలు బలంగా ఉండేందుకు ఎంతో కృషి చేస్తాయి. రాగులు, సజ్జలకు వాపు ప్రక్రియను తగ్గిస్తుంది. కీళ్ళలో వాపు తగ్గడంతోపాటు, కీళ్ళ అరుగుదలతోపాటు, నొప్పులు కూడా తగ్గుతాయి. రాగుల్లో క్యాల్షియం పుష్టిగా ఉండడం వలన వంద గ్రాముల రాగులతో 244 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. దీంతో ఎముకలు క్షీణించడం, విరగడం వంటివి తగ్గుతుంది. సజ్జల్లో ఫాస్పరస్ శాతం ఎక్కువగా ఉండడం వలన ఎముకలు బలోపేతం కావడానికి తోడ్పడుతుంది. వంద గ్రాముల సజ్జల్లో 42 మి.గ్రా. క్యాల్షియం, 296 మి.గ్రా. ఫాస్పరస్ ఉంటాయి. వీటిని రోజూ ఆహరంలో తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:
Health News: శరీరంలో అధిక వేడి సమస్యతో బాధపడుతున్నారా ? ఇలా చేస్తే వేడి తగ్గిపోవడం ఖాయం..
Health News: రోజూ వీటిని తినడం వలన కిడ్నీలో రాళ్ళ సమస్యను తగ్గించుకోవచ్చు.. అవెంటంటే ?