ఐదు రాష్ట్రల్లో హడలెత్తిస్తున్న ‘బర్డ్ ఫ్లూ’.. కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫౌల్ట్రీ రైతులకు నష్టపరిహారం చెల్లింపు

బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్నవేళ కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫౌల్ట్రీ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించింది.

ఐదు రాష్ట్రల్లో హడలెత్తిస్తున్న 'బర్డ్ ఫ్లూ'.. కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫౌల్ట్రీ రైతులకు నష్టపరిహారం చెల్లింపు
Follow us

|

Updated on: Jan 06, 2021 | 9:21 PM

Bird Flu Compensation: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్నవేళ కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఫౌల్ట్రీ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కేరళ సర్కార్ బుధవారంనాడు నిర్ణయించింది. రెండు నెలలు దాటిన పక్షలకు రూ.200 చొప్పున, నెలలోపు వాటికి రూ.100 చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు, దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ‘బర్డ్ ఫ్లూ’ విరుచుకుపడుతోంది. వందలాది పక్షులు నేలరాలుతున్నాయి. మరోవైపు వ్యాధి విస్తరించకుండా మల్టీ డిసిప్లినరీ టీమ్స్‌ను రంగంలోకి దింపింది కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ. కేరళలోని అలప్పుజ, కొట్టాయం, హర్యానాలోని పంచకుల జిల్లాలో ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నాయి. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో 12 ఎపీసెంటర్లను గుర్తించినట్టు కేంద్రం ఇప్పటికే ప్రకట్టించింది. అలాగే, పౌల్ట్రీ బాతులు, కాకులు, వసల పక్షుల నుంచి ఇన్‌ఫెక్షన్ మరింత విస్తరించకుండా ఆయా రాష్ట్రాలకు అడ్వయిజరీలను జారీ చేసింది కేంద్రం. పక్షుల్లో అసాధారణ మరణాలపై అప్రమత్తంగా ఉండాలని ఇతర రాష్ట్రాలకు కూడా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ ఒక ప్రకటనలో కోరింది.

ముఖ్యంగా రాజస్థాన్‌లోని బరాన్, కోట, జలేశ్వర్, మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్, ఇండోర్, మాల్వా ప్రాంతాల్లోని కాకుల్లో ‘బర్డ్ ఫ్లూ’ గుర్తించారు. బర్డ్ ఫ్లూ విస్తరించకుండా ఆయా రాష్ట్రాల్లో అధికారులు తీసుకుంటున్న చర్యలను రోజువారీ సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ప్రత్యేకించి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. పక్షులు అనుమానాస్పదంగా మృతిచెందితే అటవీ శాఖ సమన్వయంతో పనిచేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.