Nitin In Tirumala: సామాన్యుడిలా కాలినడకన తిరుమల చేరుకున్న నితిన్.. ఎంత ఫాస్ట్ గా 3 వేల మెట్లు ఎక్కాడంటే..?
ఊపిరి సలపనంత బిజీగా ఉన్నా కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకోవడానికి సినీ నటీనటులు, రాజకీయ వ్యాపారవేత్తలు ఉత్సాహపడతారు. చాలా మంది సెలబ్రెటీలు ఐతే సామాన్యుల్లానే ...
Nitin In Tirumala:ఊపిరి సలపనంత బిజీగా ఉన్నా కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకోవడానికి సినీ నటీనటులు, రాజకీయ వ్యాపారవేత్తలు ఉత్సాహపడతారు. చాలా మంది సెలబ్రెటీలు ఐతే సామాన్యుల్లానే తాము సరికొత్తగా చేయబోయే పనికి ముందుగా స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుంటారు. అయితే క్షణం తీరిక లేకుండా ఉండే సినీ హీరోలు, హీరోయిన్ లు ఇటీవల కాలినడకన తిరుమల చేరుకొని వెంకన్నను దర్శించుకుంటున్నారు. తాజాగా యంగ్ హీరో నితిన్ తిరుమలలో ప్రత్యక్షమయ్యాడు. అయితే శ్రీవారి దర్శనం కోసం సాధారణ వ్యక్తిలా కాలినడకన తిరుమల వెళ్ళాడు.
నితిన్ సామాన్య భక్తుల మాదిరి నడుచుకూంటూ తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. కాలి నడక హీరో వెళ్తే అక్కడ ఉండే హడావిడి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భక్తులు రద్దీ తగ్గిన నేపథ్యంలో నితిన్‌కు కాలినడక సమయంలో పెద్ద ఇబ్బంది పడలేదని సమాచారం. దాదాపు మూడు వేలకు పైగా ఉన్న మెట్లను కేవలం రెండు గంటల 20 నిమిషాల్లోనే పూర్తి చేశాడంటే.. భక్తుల నుంచి ఎలాంటి అసౌకర్యం కలగలేదని తెలుస్తోంది. బుధవారం ఉదయం నితిన్ , షాలిని దంపతులు హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్నారు. ముందుగా నితిన్.. షాలిని కారులో కొండపైకి పంపించి, ఒక్కడే నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నాడు. కాగా, నితిన్ కాలి నడకన తిరుమల వెళ్తున్న వీడియోను ఒక అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేయగా .. అది చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను రీట్వీట్ చేసిన నితిన్.. “ఓం నమో వెంకటేశాయ” అని రాశారు. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఈ యంగ్ హీరో మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ్‌దే మార్చి 26న విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు అంధాధున్ తెలుగు రీమేక్, చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్‌లో ‘చెక్’ సినిమాల్లో నటిస్తున్నాడు ఈ పవన్ భక్తుడు.
Also Read: జిగర్తాండ’ సినిమా హిందీ రిమేక్ షూటింగ్ ప్రారంభించిన సినీ యూనిట్.. హీరోగా ఆ స్టార్ ..