Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cold Water Shower: స్నానం చివరలో ఇలా చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుందట.. ఆసక్తికర విశేషాలు మీకోసం..

Cold Water Shower: చల్లటి నీటితో స్నానం అనే ఆలోచన వస్తేనే జంకుతాం. కానీ, కొంచెం ధైర్యం చేసి చన్నీటితో స్నానం చేశామంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

Cold Water Shower: స్నానం చివరలో ఇలా చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుందట.. ఆసక్తికర విశేషాలు మీకోసం..
Cold Water Shower
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 31, 2021 | 2:02 PM

Cold Water Shower: చల్లటి నీటితో స్నానం అనే ఆలోచన వస్తేనే జంకుతాం. కానీ, కొంచెం ధైర్యం చేసి చన్నీటితో స్నానం చేశామంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. గొప్ప శక్తిని, ఇమ్యూనిటీని అందిస్తుంది. చల్లని నీటితో స్నానం చేయడం వలన శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. అందమైన చర్మం, ఆరోగ్యకరమైన జట్టును సొంతం చేసుకోవచ్చు. ఇది మేం చెబుతున్నది కాదు.. అనేక అధ్యయనాలు జరిపిన తరువాత సైంటిస్టులు చెబుతున్నారు. మొదట్లో వేడి నీటితో స్నానం చేసినా.. చివర్లో కేవలం 30 సెకన్ల పాటు చన్నీటిని నెత్తిపై పోవడం ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు. ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఇలా చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయట. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.. శరీరానికి చలి తగిలినప్పుడు ఎక్కువ తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. తద్వారా ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తి పెరుగుతుంది. వేడి నీటితో స్నానం చేసిన తరువాత చివర్లో 30 సెకన్లు 50 ఫారెన్‌హీట్‌ల చల్లని వాటర్‌తో స్నానం చేస్తే ఈ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

2. డిప్రెషన్ నుండి ఉపశమనం పొందవచ్చు.. చన్నీటి జల్లులు చర్మంలోని నరాల గ్రాహకాలను ప్రేరేపిస్తాయి. తద్వారా మెదడులో కార్యకలాపాలను ఉత్తేజ పరుస్తుంది. దాంతో డిప్రెషన్ నుంచి కోలుకోవచ్చని ప్రముఖ వైద్యులు మిచెల్ గ్రీన్ తెలిపారు.

3. రోజంతా చలాకీగా ఉండేందుకు దోహదపడుతుంది.. చల్లటి నీటితో స్నానం చేయడం ద్వారా శరీరానికి చిన్నపాటి షాక్‌ తగిలినట్లుగా అనిపిస్తుంది. ఆ అనుభూతి నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫలితంగా వ్యక్తి రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు దోహదపడుతుంది.

4. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.. వేడి నీటి కంటే చల్లని నీరు జుట్టు సంరక్షణకు చాలా మంచిది అని డెబ్రా జలిమాన్ తెలిపారు. వేడి నీటితో స్నానం చేయడం ద్వారా మెరిసే గుణం, జుట్టులోనే సహజ నూనెలు తొలగిపోతాయి. తద్వారా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. అదే చన్నీటితో స్నానం చేయడం ద్వారా.. జుట్టు మెరుస్తుంది. పెరుగుదల కూడా కనిపిస్తుంది.

5. పొడి చర్మం నుండి ఉపశమనం.. కొందరు చర్మం పాలిపోయినట్లుగా, పగుళ్లతో ఉంటుంది. అలాంటి వాటి నుంచి ఉపశమనం పొందాలంటే ముఖ్యంగా వేడి నీటితో స్నానాన్ని ఆపేయాలి. చన్నీటితో స్నానం చేయడం ద్వారా చర్మం పొడిబారకుండా ఉంటంది, ముఖం మెరుస్తున్నట్లుగా ఉంటుంది. అంతేకాదు, ముఖంపై మంట, వాపు, దద్దుర్లను తగ్గిస్తుంది.

6. వ్యాయామం తర్వాత ఉపశమనం పొందాలంటే.. తీవ్రమైన వ్యాయామం చేసిన తరువాత కండరాలు అలసిపోయినట్లుగా ఉంటాయి. అలాంటి పరిస్థితి నుంచి ఉపశమనం పొందాలంటే చల్లని నీటితో స్నానం చేయడం ఉపకరిస్తుంది. చన్నీటితో స్నానం చేయడం ద్వారా అలసట తగ్గుతుందని పలు అధ్యయనాల్లో పేర్కొంది.

చన్నీటితో స్నానం ప్రమాదం కూడా.. గుండె సంబంధిత వ్యాధులు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వ్యక్తులు చన్నీటితో స్నానం చేసే ముందు జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటితో స్నానం చేసిన తరువాత, చివరలో 30 సెకన్లు చన్నీటితో స్నానం చేయడం ఇలాంటి వ్యక్తులకు ప్రమాదకరం అని తెలిపారు. గుండె సంబంధిత వ్యాధులు కలిగిన వారు.. 10°C కంటే తక్కువగా ఉష్ణోగ్రత కలిగిన నీటితో స్నానం చేయొద్దని, ఒకవేళ చేయాలనుకుంటే నిపుణులను సంప్రదించి చేయాలని సూచిస్తున్నారు.

Also read:

Crime News: భార్యే భర్తను చంపింది.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి..

Regina Cassandra: తన అందాలతో కుర్రగుండెల్లో గిలిగింతలు పెడుతున్న రెజీనా..

Aamna Sharif: మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ అందాలు… ఆమ్నా షరీఫ్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌