పురుషుల కొంప ముంచుతున్న ప్లాస్టిక్.. దానిపై తీవ్ర ప్రభావం.. శాస్త్రవేత్తల సూచన ఇదే..
ప్లాస్టిక్ మన రెగ్యులర్ లైఫ్‌లో ఒక భాగం అయిపోయింది. అంతేకాకుండా మన శరీరంలో కూడా భాగం అయింది. వాటర్ బాటిల్, టీ కప్, పేపర్ ప్లేట్ ఇలా ఏదైనా ప్లాస్టిక్‌తో ముడిపడింది. ప్లాస్టిక్ ఉపయోగం మానవ జాతి మనుగడకు ముప్పులా మారింది. ప్లాస్టిక్‌లో అత్యంత సూక్ష్మరూపంలో ఉండే ప్లాస్టిక్ రేణువులు గాలిలో చేరుతున్నాయి. మనం తీసుకునే డ్రింక్, ఫుడ్ ద్వారా నీరు, ఆహారంలో కలుస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల రేణువులు గాలి, నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి హృదయం, మెదడు, మూత్రపిండాలు, కాలేయం ఇలా శరీరంలోని ప్రతి అవయవంపై దుష్ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు.. మనిషి ఆరోగ్యంపై చాలా రకాలుగా చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రమాదకరమైన మైక్రో ప్లాస్టిక్ శరీరంలోని అన్ని అవయవాలకు పాకుతుంది. ఈమధ్య న్యూ మెక్సికో వర్సిటీ పరిశోధకులు పురుషుడి వృషణాలో మైక్రో ప్లాస్టిక్ రేణువులను గుర్తించారు. చైనా పరిశోధకులు వీర్యకణాల్లోనూ ఈ ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు తేల్చారు. చైనాకు చెందిన ఆరోగ్యవంతులైన 36 మంది యువకుల శుక్రకణాలను ప్రయోగశాలలో పరీక్షించగా అన్ని శాంపిల్స్‌లలో మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు గుర్తించారు.
ప్లాస్టిక్ వాటర్ బాటిల్లు, బ్యాగుల తయారీలో వాడే పాలి ఇథైలిన్, పాలివినైల్ క్లోరైడ్, పాలి స్టెయిరిన్ వంటి రేణువులను వీర్యంలో గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. సంతాన ఉత్పత్తికి కీలకమైన శుక్రకణాల కదలికలను ప్లాస్టిక్ రేణువులు అడ్డుకుంటున్నాయని, శుక్రకణాల ఎదుగుదల నిర్మాణాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటలీలో నిర్వహించిన మరో అధ్యయనంలోని పురుషుల శుక్రకణాల్లో మైక్రో ప్లాస్టిక్‌ను గుర్తించినట్లు రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. పురుష సంతానోత్పత్తి సామర్ధ్యంపై ఇవి తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. ప్లాస్టిక్‌ను వీలైనంత ఎక్కువగా అవాయిడ్ చేయాలని సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..