Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kids Health: మీ పిల్లల కంటి చూపు మందగిస్తోందా ?.. అజాగ్రత్త వద్దు.. ఇలా చేయండి..

పోషకాలు లేకపోవడం వల్ల కంటి చూపు బలహీనపడుతుంది. పిల్లల ఆహారంలో విటమిన్లు ఎ, సి, ఇ, జింక్ ఉండాలి.

Kids Health:  మీ పిల్లల కంటి చూపు మందగిస్తోందా ?.. అజాగ్రత్త వద్దు.. ఇలా చేయండి..
Children's Eyesight
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 29, 2022 | 8:41 PM

పిల్లలు గాడ్జెట్‌లు, ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లలో గేమ్స్ ఆడటానికి ఇష్టపడుతున్నారు. అయితే, స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడపడం వల్ల పిల్లల కళ్లపై ప్రభావం పడుతుంది. పిల్లలకు కంటి చూపు బలహీనంగా ఉన్నప్పుడు కళ్లలో నొప్పి, చూపు మందగించడం.. తలనొప్పి వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. స్క్రీన్‌పై నిరంతరం సమయం గడపడం వల్ల పిల్లలకు చిన్న వయస్సులోనే అద్దాలు వస్తున్నాయి. పిల్లలు టీవీ లేదా మొబైల్ ఫోన్లలో ఎక్కువ సమయం గడిపే అలవాటును సకాలంలో తగ్గించినట్లైతే ఈ సమస్యను విజయవంతంగా చెక్ పెట్టొచ్చు.

ఈ విధంగా పిల్లల కంటి సమస్యను గుర్తు పట్టండి..

చాలా మంది పిల్లలు తమ కళ్లు బలహీనమవుతున్నాయని కూడా గుర్తించరు. కొన్ని ప్రారంభ లక్షణాలను చూడటం ద్వారా మీ బిడ్డకు కంటి సమస్య ఉందని మీరు తెలుసుకోవచ్చు.మంట, దురద మొదలవుతుంది. మీ పిల్లలు తమ కళ్లను మళ్లీ మళ్లీ రుద్దడం మొదలు పెడుతారు. మీ బిడ్డ చాలా సేపు తన కళ్లను రుద్దుకుంటే అప్పుడు ఖచ్చితంగా అతనిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లండి.

మీ బిడ్డ తరచు తలనొప్పిగా ఉందని బాధపడుతున్నాడు అంటే వెంటనే డాక్టర్‌కు చూపించడం మంచింది. ఇది కూడా బలహీనమైన దృష్టికి సంబంధించిన ప్రారంభ సంకేతాలలో ఒకటి. మీ బిడ్డకు క్రమం తప్పకుండా తలనొప్పి ఉంటే ఖచ్చితంగా కంటి పరీక్ష చేయించుకోండి. మీ పిల్లలు చదవడానికి లేదా చూడడానికి కావలసినంత దగ్గరగా వస్తువులను తీసుకురావాల్సి వస్తే.. అది బలహీనమైన కంటి చూపుకు సంకేతం కావచ్చు. ఇలా జరిగితే, మీ బిడ్డను కంటి వైద్యుని వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించుకోండి. అయితే కంటి సంరక్షణ కోసం చిట్కాలు తెలుసుకుందాం-

పిల్లల ఆహారం పట్ల శ్రద్ధ వహించండి

ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల కంటి చూపు మందగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, పిల్లల ఆహారంలో విటమిన్లు A, C, E , జింక్ యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉండాలి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మంచి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా ముఖ్యమైనవి. దీని కోసం, మీరు మీ పిల్లల ఆహారంలో క్యారెట్, బ్రోకలీ, బచ్చలికూర, స్ట్రాబెర్రీ, చిలగడదుంపలను చేర్చవచ్చు.

గాడ్జెట్‌లకు దూరంగా ఉండండి

గాడ్జెట్‌ల వల్ల ఎక్కువగా నష్టపోయేది పిల్లల కళ్లు. ఈ గాడ్జెట్లు పిల్లల కంటి చూపును బలహీనపరిచేలా పనిచేస్తాయి. అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు పిల్లలను గాడ్జెట్లను ఎక్కువగా ఉపయోగించకుండా నిరోధించాలి. దీని కోసం, పిల్లల కోసం కొంత సమయం కేటాయించండి. వారితో వివిధ రకాల మైండ్ గేమ్‌లు ఆడండి.

పిల్లల కళ్లను తనిఖీ చేయండి

కళ్ళు మన శరీరంలోని ముఖ్యమైన, సున్నితమైన భాగాలలో ఒకటి. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకోవాలి. అందువల్ల కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే సకాలంలో గుర్తించి చికిత్స అందించవచ్చు. వైద్యుల అభిప్రాయం ప్రకారం, ప్రతి ఆరు నెలలకోసారి కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరం. అందుకే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కళ్లను చెక్ చేయించండి. ఇది కాకుండా, పిల్లల ఆహారంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉండాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం