ఉదయాన్నే ఇలా చేస్తే జిమ్‌కు వెళ్లకుండానే బరువు తగ్గొచ్చు.. ఒక్క గ్లాసు నీటితో మటాష్ అంతే..

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా మనం తీసుకుంటున్న ఆహారం.. జీవనశైలే దీనికి కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలోని ప్రజలు జిడ్డుగల ఆహారాలు, తీపి వంటకాలను చాలా ఇష్టపడతారు. దీని కారణంగా ఊబకాయానికి గురవుతారు. ఒక్కసారి బరువు పెరిగితే తగ్గించుకోవడం చాలా కష్టమవుతుంది.

ఉదయాన్నే ఇలా చేస్తే జిమ్‌కు వెళ్లకుండానే బరువు తగ్గొచ్చు.. ఒక్క గ్లాసు నీటితో మటాష్ అంతే..
Ajwain Water
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 26, 2024 | 9:00 AM

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా మనం తీసుకుంటున్న ఆహారం.. జీవనశైలే దీనికి కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలోని ప్రజలు జిడ్డుగల ఆహారాలు, తీపి వంటకాలను చాలా ఇష్టపడతారు. దీని కారణంగా ఊబకాయానికి గురవుతారు. ఒక్కసారి బరువు పెరిగితే తగ్గించుకోవడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి రోజువారీ జీవితంలో సమయం కేటాయించి వ్యాయామశాలకు వెళ్లడానికి తగినంత సమయం లేదు. అలాగే ప్రతి ఒక్కరూ సరైన ఆహారం గురించి చెప్పే డైట్ నిపుణుడిని పొందలేరు. అందుకే.. అలాంటి వారి కోసం ఇంట్లోనే తయారకు చేసుకునే ఓ డ్రింక్ ను పరిచయం చేయబోతున్నాం.. ఇప్పుడు మీరు సులభంగా బరువు తగ్గాలనుకుంటే మీరు ఈ ప్రత్యేకమైన డ్రింక్ సహాయం తీసుకోవచ్చు.. అదేంటో తెలుసుకోండి..

వాము నీరు సహాయంతో ఈజీగా బరువు తగ్గొచ్చు..

బరువు తగ్గడానికి వాము ఎఫెక్టివ్ రెమెడీ అని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఆయుర్వేద, ఔషధ గుణాలతో నిండి ఉంది. వాము నీటిని తాగడం వల్ల పొట్ట, నడుము కొవ్వు తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఈ మసాలా దినుసు వాము నీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వాము నీటిని ఎలా ఉపయోగించాలి..

రోజూ ఉదయం ఏమీ తినకుండా వాము నీటిని తాగితే త్వరగా బరువు తగ్గడంతోపాటు పొట్ట కూడా తగ్గుతుంది.

వాము నీటిని కొద్దిగా వేడి చేసిన తర్వాత కూడా తాగవచ్చు. ఇంకా మీకు మంచి ఫలితాలు కావాలంటే మీ రోజువారీ ఆహారంలో వాము వినియోగాన్ని పెంచుకోవచ్చు..

బరువు తగ్గడానికి కొంచెం వామును ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగడంతోపాటు తినండి.

ఇలా నెల రోజుల పాటు వాము నీటిని తాగితే మీ శరీరంలో తేడాను గుర్తించవచ్చు.. ఇంకా బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు..

మీరు రాత్రిపూట వామును నీటిలో నానబెట్టడం మరచిపోతే, ఉదయం, ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా వామును కలపండి. దానిని ఒక పాత్రలో ఉడకబెట్టండి. అందులో 5-6 తులసి ఆకులను వేసి మరిగించండి.. అనంతరం గోరువెచ్చగా అయ్యాక ఫిల్టర్ చేసి తాగండి..

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..