AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cardamon Powder for BP: చిటికెడు ఈ పౌడర్‌తో బీపీనీ పొగొట్టొచ్చు.. మళ్లీ రమ్మన్నా రాదు!

మారిన జీవన విధానంలో వచ్చే సమస్యల్లో బీపీ కూడా సర్వ సాధారణంగా మారింది. ఇది వరకు కేవలం పెద్దలకు మాత్రమే వచ్చేది. అది కూడా అక్కడక్కడ మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు బీపీ అనేది చిన్న వయసులో ఉన్న వాళ్లకు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు బీపీ అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. బీపీ ఒక్కసారి వచ్చిందంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం. మీ ఆహార విషయాల్లో కూడా అనేక మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఏదైనా సమస్య రాకుండా ఉన్నంతవరకే చాలా..

Cardamon Powder for BP: చిటికెడు ఈ పౌడర్‌తో బీపీనీ పొగొట్టొచ్చు.. మళ్లీ రమ్మన్నా రాదు!
Blood Pressure
Chinni Enni
|

Updated on: Jan 18, 2024 | 1:14 PM

Share

మారిన జీవన విధానంలో వచ్చే సమస్యల్లో బీపీ కూడా సర్వ సాధారణంగా మారింది. ఇది వరకు కేవలం పెద్దలకు మాత్రమే వచ్చేది. అది కూడా అక్కడక్కడ మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు బీపీ అనేది చిన్న వయసులో ఉన్న వాళ్లకు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు బీపీ అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. బీపీ ఒక్కసారి వచ్చిందంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం. మీ ఆహార విషయాల్లో కూడా అనేక మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఏదైనా సమస్య రాకుండా ఉన్నంతవరకే చాలా ఆరోగ్యంగా ఉంటాం. వచ్చిదంటే మరిన్ని సమస్యలు వస్తాయి.

సైలెంట్ కిల్లర్‌గా మారిన బీపీ..

బీపీ అస్సలు తేలిగ్గా తీసుకోవడానికి లేదు. బీపీ కారణంగా గుండె పోటు, మూత్ర పిండాల వైఫల్యం, పక్షవాతం వంటి ప్రమాదకర వ్యాధులు సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీపీని వైద్యులు సైలెంట్ కిల్లర్‌గా చెబుతూ ఉంటారు. బీపీని ముందుగానే కనిపెట్టాలి. లేదంటే.. క్రమ క్రమంగా శరీర ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. బీపీని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సైతం చెబుతున్నారు. అయితే మీరు తీసుకునే ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేయడం వల్ల దీన్ని అదుపు చేయవచ్చు.

యాలకులతో అదుపు చేయవచ్చు..

బీపీని కంట్రోల్ చేయడంలో యాలక్కాయలు అద్భుతంగా పని చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇదే విషయం పలు పరిశోధనల్లో కూడా తేలిందట. ప్రతి రోజూ యాలక్కాయల పొడి ఉదయం మూడు గ్రాములు, సాయంత్రం మూడు గ్రాములు.. ఇలా రెండు, మూడు నెలలు తీసుకుంటే.. బీపీ అదుపులోకి వస్తుందని తేలింది. మందులు వాడే అవసరం లేకుండా యాలక్కాయల పొడితో మొదటి దశలో ఉన్న బీపీని కంట్రోల్ చేయవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది.

ఇవి కూడా చదవండి

బీపీ లేని వారు కూడా తీసుకోవచ్చు..

అదే విధంగా బీపీ లేని వారు ఉదయం, సాయంత్రం రెండు యాలకులను తీసుకోవడం వల్ల కూడా బీపీని అదుపు చేయవచ్చని అంటున్నారు నిపుణులు. ఈ విధంగా సైలెంట్ కిల్లర్ అయిన బీపీని అదుపు చేయడంలో యాలకులు ఎంతో చక్కగా మనకు హెల్ప్ చేస్తాయి. అదే విధంగా ఎప్పటికప్పుడు బీపీని చెక్ చేసుకుంటూ.. శరీరంలో వచ్చే మార్పులను చెక్ చేసుకుంటూ ఉంటే బీపీని ముందుగానే పసిగట్టవచ్చు. ఆ తర్వాత పెద్ద ప్రమాదాలు రాకుండా చూడొచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.