Arthritis Pain Relief Tips: కీళ్లు, మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా.. వీటిని తింటే సెట్!
వయసు కాస్త పైబడగానే కీళ్ల, మోకాళ్ల నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ఈ నొప్పులు పెద్దలకు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు యంగ్ ఏజ్‌లోనే చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి ముఖ్య కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం. అందులోనూ వింటర్ సీజన్ వచ్చిందంటే ఈ నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి. అయితే వీటికి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల పండ్లు తీసుకుంటే చాలు వీటిని సెట్ చేసేయవచ్చు. రోజూ ఈ పండ్లను తింటే..
వయసు కాస్త పైబడగానే కీళ్ల, మోకాళ్ల నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ఈ నొప్పులు పెద్దలకు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు యంగ్ ఏజ్‌లోనే చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి ముఖ్య కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం. అందులోనూ వింటర్ సీజన్ వచ్చిందంటే ఈ నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి. అయితే వీటికి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల పండ్లు తీసుకుంటే చాలు వీటిని సెట్ చేసేయవచ్చు. రోజూ ఈ పండ్లను తింటే శీతా కాలంలో వచ్చే ఆర్థరైటిస్ నొప్పుల నుంచి రిలీఫ్ నెస్ పొందవచ్చు. ఈ నొప్పులు తగ్గేందుకు తీసుకోవాల్సిన పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి పండ్లు:
బొప్పాయి పండ్లలో విటమిన్ సి, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, బీటా కెరోటీన్, ఎంజైమ్‌లు వంటివి ఉంటాయి. ఆర్థరైటిన్ నొప్పులు ఉన్న వారు బొప్పాయిని చలి కాలంలో తీసుకుంటే వాటి నుంచి ఉపశమనం పొంద వచ్చు. ఈ సమస్య నుంచి సులభంగా బయట పడొచ్చు. అంతేకాకుండా స్కిన్ కూడా హైడ్రేట్ అవుతుంది.
విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్:
విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తినడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. పైనాపిల్, నారింజ, ద్రాక్ష, నిమ్మ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ జాతికి చెందిన పండ్లు వంటివి తినడం వల్ల ఎంతో మేలు చేస్తుంది. కనుక రోజూ వీటిని తింటున్నా కూడా ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. వీటిల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్వలు ఉంటాయి. ఇవి శరీరంలో హానికర ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తాయి. కీళ్ల, మోకాళ్ల నొప్పులు ఉన్న వారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా ఇవి తినడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.
చెర్రీ పండ్లు:
చెర్రీ పండ్లు కూడా కీళ్ల,మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి. వీటిల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనప్పుడల్లా వీటిని తింటే మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థరైటిస్ నొప్పుల నుంచి బయట పడొచ్చు.
యాపిల్:
ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదు. యాపిల్ సర్వ రోగ నివారిణిగా చెబుతూంటారు. యాపిల్ తిన్నా కీళ్ల, మోకాళ్ల నొప్పులు కంట్రోల్ అవుతాయి. రోజూ ఒక యాపిల్ తినడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.