AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఇవి ఆల్కహాల్‌ కంటే డేంజర్‌.. లివర్‌ ఆరోగ్యాన్ని దెబ్బ తిస్తాయి.

అయితే మనం చేసే తప్పుల కారణంగా కాలేయం అనారోగ్యం బారిన పడుతుంది. సాధారణంగా లివర్‌ పాడవ్వడానికి ఆల్కహాల్‌ ప్రధాన కారణమని అనుకుంటాం. అతిగా మద్యం సేవించే చాలా మందిలో లివర్‌ సంబంధిత సమస్యలు వస్తుంటాయి. అయితే లివర్‌ ఆరోగ్యం కేవలం ఆల్కహాల్ వల్ల మాత్రమే కాదని...

Health: ఇవి ఆల్కహాల్‌ కంటే డేంజర్‌.. లివర్‌ ఆరోగ్యాన్ని దెబ్బ తిస్తాయి.
Liver Health
Narender Vaitla
|

Updated on: Jan 18, 2024 | 3:47 PM

Share

మానవ శరీరంలో కాలేయం అతిపెద్ద గ్రంథి అనే విషయం తెలిసిందే. శరీరంలో సుమారు 500 రకాల చర్యలను కాలయమే నియంత్రిస్తుంది. అందుకే లివర్‌ను ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని వైద్య నిపుణులు సైతం చెబుతుంటారు. ర‌క్తంలో ఉన్న విష ప‌దార్థాల‌ను తొల‌గించ‌డం, శ‌రీరానికి అవ‌స‌ర‌మైన‌ శ‌క్తిని అందించ‌డం వంటి కార్యకలాపాలను చేపట్టడంలో లివర్‌ కీలక పాత్ర పోషిస్తుంది.

అయితే మనం చేసే తప్పుల కారణంగా కాలేయం అనారోగ్యం బారిన పడుతుంది. సాధారణంగా లివర్‌ పాడవ్వడానికి ఆల్కహాల్‌ ప్రధాన కారణమని అనుకుంటాం. అతిగా మద్యం సేవించే చాలా మందిలో లివర్‌ సంబంధిత సమస్యలు వస్తుంటాయి. అయితే లివర్‌ ఆరోగ్యం కేవలం ఆల్కహాల్ వల్ల మాత్రమే కాదని తీసుకునే ఆహారం ద్వారా కూడా లివర్‌ ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ కాలేయం పనితీరుపై దుష్ప్రభావం చూపే ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కాలేయ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన చక్కెర ఫ్యాటీ లివర్‌కు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.

* ఇక కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు, లివర్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

* ఉప్పు ఎక్కువ మోతాదులో తీసుకునే వారిలోనూ కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది ఇది గుండె ఆరోగ్యంతో పాటు లివర్‌ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

* ప్రాసెస్‌ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకున్నా లివర్‌ ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్డ్‌ ఫుడ్‌లో సహజంగానే సోడియం, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి ఇవి లివర్‌ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

* కొన్ని రకాల మందులను ఎక్కువగా తీసుకున్నా లివర్‌పై దుష్ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెయిన్‌ కిల్లర్స్‌ను ఎక్కువగా తీసుకుంటే ఈ ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.

* కేవలం ఆల్కహాల్‌ డ్రింక్స్‌ మాత్రమే కాకుండా కూల్‌ డ్రింక్స్‌ కూడా లివర్‌ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. నాన్‌ ఆల్కహాలిక్‌ డ్రింక్స్‌ ఫ్యాటీ లివర్‌ డిసీస్‌కు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..