ఉదయం 8లోపు టిఫిన్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా.? షాకింగ్ విషయాలు..
ఇక ఉదయం టిఫిన్ తీసుకోవడం ఎంత ముఖ్యమో, తినే సమయం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. రాత్రి త్వరగా భోజనం చేయడం చేస్తే ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో, ఉదయం ఆలస్యంగా టిఫిన్ చేస్తే నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు...
మనలో చాలా మంది బద్దకమో, మరో కారణంతోనే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఉదయం టిఫిన్ చేయకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని నిపుణులు ఇప్పటికే చెబుతుంటారు. ఉదయం టిఫిన్ చేయకపోతే గుండె ఆరోగ్యంపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుందని అనేక పరిశోధనల్లో రుజువైంది కూడా.
ఇక ఉదయం టిఫిన్ తీసుకోవడం ఎంత ముఖ్యమో, తినే సమయం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. రాత్రి త్వరగా భోజనం చేయడం చేస్తే ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో, ఉదయం ఆలస్యంగా టిఫిన్ చేస్తే నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఆలస్యంగా టిఫిన్ చేసే వారిలో గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది.
ఫ్రెంచ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ ఫుడ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఉదయం 9 గంటల తర్వాత మొదటి భోజనం చేసేవారిలో గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని వెల్లడించింది. ఆలస్యమైన ప్రతి గంటకు గుండె జబ్బుల ప్రమాదం 6 శాతం పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
పరిశోధనలో భాగంగా 2009 నుంచి 2022 వరకు డేటాను సేకరించింది. ఇందుకోసం 100000 కంటే ఎక్కువ మందికి సంబంధించిన షాంపిల్స్‌ను సేకరించారు. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసేవారు లేదా ఉదయం లేట్‌గా అల్పాహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. అయితే రాత్రిపూట ఎక్కువసేపు ఉపవాసం ఉండడం వల్ల స్ట్రోక్ వంటి సెరెబ్రోవాస్కులర్ వ్యాధుల ముప్పు తగ్గుతుంది.
రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేసే మహిళల్లో స్ట్రోక్, సెరెబ్రోవాస్కులర్ డిసీజ్ వచ్చే సమస్య.. రాత్రి 8 గంటల ముందు తినేవారితో పోల్చితే 28 శాతం తగ్గుతుందని తేలింది. గుండె జబ్బులను తగ్గించడంలో భోజన సమయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రాత్రి త్వరగా భోజనం తీసుకోవడం, ఉదయం 8 గంటలలోపు టిఫిన్ చేసే వారిలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..