Mango Leaves: ఓర్నీ.. మామిడి ఆకుతో ఇన్ని ఉపయోగాలా.. మీకు తెల్సా..
మన ఇంటి పెరటి మొక్కల్లోనే ఎన్నో వ్యాధులను తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయని మన పెద్దలు తరచుగా చెప్తూ ఉంటారు. ఈ వరుసలో మామిడి ఆకు కూడా చేరింది. మామిడి ఆకును అదృష్టానికి చిహ్నంగా మతపరమైన వేడుకలలో అలంకరణగా కూడా ఉపయోగిస్తారు. ఈ మామిడి ఆకులో వైద్యం చేసే గుణాలు కూడా ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మామిడి.. పండ్లలో రారాజు అన్న సంగతి తెలిసిందే. చాలామంది మామిడి పండ్ల సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. మామిడి రుచిగా ఉండటం మాత్రమే కాదు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే మామిడి ఆకుతో కూడా బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా..?. అవును.. మామిడి ఆకులో ఆరోగ్యకరమైన పోషకాలు విటమిన్ సి, ఎ, బి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మామిడి ఆకు ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ ఆకు కషాయాన్ని చాలామంది తరచుగా తాగుతూ ఉంటారు.
మామిడి ఆకు ఆరోగ్య ప్రయోజనాలు
* మామిడి ఆకుల కషాయాన్ని రోజుకు రెండుసార్లు తీసుకుంటే విరేచనాలు నయమవుతాయి.
* చిన్న మామిడి ఆకును నమలడం వల్ల చిగుళ్లలో రక్తస్రావం తగ్గుతుంది.
* గాయం అయిన చోట ఎండు మామిడి ఆకులను కాల్చి, దాని బూడిదను పూయాలి. దీంతో అది త్వరగా నయమవుతుంది
* కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడేవారు ఒక చెంచా మామిడి ఆకుల పొడిని ఒక గ్లాసులో వేసి రాత్రంతా నీటిలో ఉంచాలి. ఉదయాన్నే నిద్రలేచి ఈ నీటిని తాగడం వల్ల కిడ్నీలోని రాయి మూత్రం ద్వారా బయటకు వస్తుంది.
* మామిడి ఆకులను నీళ్లలో నానబెట్టి మూత పెట్టాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే పొట్ట సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
* స్నానం చేసే నీళ్లలో మామిడి ఆకులను వేసి, ఆ నీటితో స్నానం చేయడం వల్ల రిఫ్రెష్ అనుభూతి కలుగుతుంది. ఇవికాక…
- చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. …
- జుట్టు సమస్యలకు బాగా పనిచేస్తుంది. …
- రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయండి. …
- అధిక రక్తపోటును తగ్గిస్తుంది
- కడుపు పూతలు, ఎక్కిళ్ళను తగ్గిస్తుంది
- బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.







