Pippali Benefits: పిప్పళ్లతో ఎన్ని రోగాలకు చెక్ పెట్టొచ్చో తెలుసా?
పిప్పాలి దీన్నే పిప్పళ్లు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్‌కు వీటి గురించి తెలియక పోవచ్చు. కానీ పూర్వం వీటిని ఎన్నో వ్యాధులు తగ్గించేందుకు ఉపయోగించే వారు. ఆయుర్వేదంలో కూడా పిప్పళ్లను అనేక రోగాలకు ఔషధంలా యూజ్ చేశారు. పిప్పళ్లలో అనాల్జేసిక్ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇది అర్థరైటిస్, తల నొప్పి, కండరాల నొప్పులతో సహా వివిధ రకాల నొప్పులకు ఉపశమనాన్ని అందిస్తుంది. జీర్ణ సమస్యలతో సతమతమవుతున్న వారు పిప్పాలితో చెక్ పెట్టొచ్చు. ఇంకా వీటితో ఎలాంటి..
పిప్పాలి దీన్నే పిప్పళ్లు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్‌కు వీటి గురించి తెలియక పోవచ్చు. కానీ పూర్వం వీటిని ఎన్నో వ్యాధులు తగ్గించేందుకు ఉపయోగించే వారు. ఆయుర్వేదంలో కూడా పిప్పళ్లను అనేక రోగాలకు ఔషధంలా యూజ్ చేశారు. పిప్పళ్లలో అనాల్జేసిక్ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇది అర్థరైటిస్, తల నొప్పి, కండరాల నొప్పులతో సహా వివిధ రకాల నొప్పులకు ఉపశమనాన్ని అందిస్తుంది. జీర్ణ సమస్యలతో సతమతమవుతున్న వారు పిప్పాలితో చెక్ పెట్టొచ్చు. ఇంకా వీటితో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది:
పిప్పళ్లతో జీర్ణ సమస్యలు, వాత, పిత్త సమస్యలను దూరం చేసుకోవచ్చు. వీటిని తీసుకుంటే అజీర్తి, మలబద్ధకం ప్రాబ్లమ్స్‌కి చెక్ పెట్టినట్లే. ఇందులో కార్మినేటిక్ లక్షణాలు గ్యాస్, ఉబ్బరం క్లియర్ చేయడంలో సహాయ పడతాయి. కడుపు తేలిగ్గా ఉంటుంది.
శ్వాస కోశ సమస్యలు తీరుతాయి:
శ్వాస కోశ సమస్యలతో సతమతం అవుతున్న వారు పిప్పళ్లను తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఆస్తమా ఉన్న, ఆయాసం, ఉబ్బసం వంటి వారు చలి కాలంలో పిప్పళ్లు తీసుకుంటే శ్వాస నాళం క్లియర్ అవుతుంది. తద్వారా సులభంగా శ్వాస తీసుకోవడానికి వీలుంటుంది. జలుబు, ఫ్లూ వంటివి దరి చేరకుండా ఉంటాయి. ఎక్కువగా జలుబు బారిన పడేవారు ఇది తీసుకుంటే చాలా మంచింది. ఆయుర్వేదంలో కూడా దీన్ని ఔషధంలా ఉపయోగిస్తారు.
నోటి ఆరోగ్యం మెరుగు పడుతుంది:
నోటి ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవడంలో కూడా పిప్పాలి బాగా సహాయ పడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, అస్ట్రింజెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇది నోటి దుర్వాసన, చిగుళ్ల వాపులను తగ్గించి.. దంతాలను స్ట్రాంగ్‌గా చేస్తుంది. అంతే కాకుండి నోటిలో చిన్న చిన్న సమస్యలని కూడా పోగొడుతుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది:
ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాటిని తగ్గించుకోవాలంటే పిప్పాలి బాగా సహాయ పడుతుంది. అంతే కాకుండా లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా పిప్పాలి చక్కని ఔషధంగా చెప్పొచ్చు. అదే విధంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఫ్రీ రాడికల్స్ తగ్గేట్టు చేయడంలో హెల్ప్ చేస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.