AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Weight Loss Tips: మహిళలూ వెయిట్ లాస్ అవ్వాలా.. ఇలా చేస్తే సరి!

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లోని వాళ్లందరూ హెల్దీగా ఉంటారు. ఆ ఇల్లు కూడా శుభ్రంగా కళకళలాడుతూ ఉంటుంది. ఇంట్లోని మహిళలకు ఏదైనా జబ్బు చేసిందంటే.. ఆ ఇల్లు ఇల్లుగా ఉండదు. మగవారు ఎంత హెల్ప్ చేసి.. పని చేసినా.. ఇల్లాలి తీరు రాదు కదా. చాలా మంది మహిళలు ప్రస్తుతం అధిక బరువు, ఊబకాయంతో సతమతమవుతున్నారు. బరువు తగ్గాలనే ఆశతో తినడం మానేస్తున్నారు. ఇవి కాస్తా ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. మహిళలు బరువు తగ్గడం అనేది కాస్త..

Women Weight Loss Tips: మహిళలూ వెయిట్ లాస్ అవ్వాలా.. ఇలా చేస్తే సరి!
Weight Loss
Chinni Enni
|

Updated on: Jan 18, 2024 | 5:48 PM

Share

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లోని వాళ్లందరూ హెల్దీగా ఉంటారు. ఆ ఇల్లు కూడా శుభ్రంగా కళకళలాడుతూ ఉంటుంది. ఇంట్లోని మహిళలకు ఏదైనా జబ్బు చేసిందంటే.. ఆ ఇల్లు ఇల్లుగా ఉండదు. మగవారు ఎంత హెల్ప్ చేసి.. పని చేసినా.. ఇల్లాలి తీరు రాదు కదా. చాలా మంది మహిళలు ప్రస్తుతం అధిక బరువు, ఊబకాయంతో సతమతమవుతున్నారు. బరువు తగ్గాలనే ఆశతో తినడం మానేస్తున్నారు. ఇవి కాస్తా ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. మహిళలు బరువు తగ్గడం అనేది కాస్త కష్టంతో కూడుకున్న పని. ఇంట్లో అంత పని చేసిన తర్వాత.. తమకంటూ సమయం కూడా ఉండదు. అందులోనూ పిల్లలు పుట్టాక వారి బాధ్యతలు మరింత ఎక్కువ అవుతాయి. శరీరంలో కూడా చాలా మార్పులు వస్తాయి. కేవలం అందం కోసమే కాదు.. ఆరోగ్యంగా ఉండేందుకు కూడా బరువును తగ్గించు కోవడం చాలా అవసరం.

కేవలం పురుషులే కాదు మహిళలు కూడా తమ బరువును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. బరువు పెరగడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు, బీపీ, డయాబెటీస్, కాలేయ వ్యాధులు, థైరాయిడ్, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. బరువు తగ్గడం కోసం మరీ ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. రన్నింగ్, వాకింగ్ వంటివి ప్రతి రోజూ చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే చాలు.. సులభంగా బరువు తగ్గుతారు. మరి లేడీస్ బరువు తగ్గేందుకు సులభమైన మార్గాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

నచ్చిన పనులు చేయండి:

చాలా మంది బరువు తగ్గాలన్న ఆశతో.. కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అలా చేయాల్సిన పని లేదు. మీకు ఆసక్తిగా ఉండి, మీరు చేయగలిగనవే చేయండి. లేడీస్ కి వాకింగ్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. దీని వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

తగిన విశ్రాంతి తీసుకోండి:

బరువు తగ్గేందుకు శరీరానికి కావాల్సినంత విశ్రాంతి కూడా తీసుకుంటూ ఉండాలి. ప్రతి రోజూ తగినంత నిద్ర పోవాలి. ముఖ్యంగా ఆందోళన, ఒత్తిడి వంటివి దరి చేరకుండా చూసుకోండి. ప్రశాంతంగా ఉండి నిద్రపోయేందుకు ప్రయత్నించండి.

పొట్ట కొవ్వు ఇలా అదుపు చేయండి:

సమయం కాని సమయంలో తినడం వల్ల కూడా కొవ్వు అనేది పడుతుంది. అదే విధంగా డీప్ ఫ్రై ఐటెమ్స్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌ని కొన్ని రోజులు దూరం పెట్టడం చాలా మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.